Movie News

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్బులో అడుగుపెట్టే దాకా తను పడిన స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు లాంటి కీలకమైన మార్కెట్లు కూడా ఈ సందర్భంగా దెబ్బ తిన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంతగా అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు చెప్పిన దాని కన్నా డబుల్ రేట్లు వచ్చేంతగా.

జై భీమ్ రూపంలో సూర్యకు ఒక మర్చిపోలేని క్లాసిక్ ఇచ్చిన దర్శకుడు టీజె జ్ఞానవేల్. తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో వెట్టయన్ చేశారు కానీ ఆది ఆశించిన ఫలితం అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. సామజిక సమస్యకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని చూసిన జ్ఞానవేల్ రజనిని హ్యాండిల్ చేయడంలో తడబడ్డారు. దీంతో పరాజయం తప్పలేదు. ఇక మళ్ళీ సూర్యతో చేయి కలిపిన జ్ఞానవేల్ ఒక విభిన్నమైన బయోపిక్ ఎంచుకున్నారని సమాచారం.

చెన్నైకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తిరువేంగడం పేదల పాలిట పెన్నిధిగా పేరొందారు. కన్సల్టింగ్ ఫీజుగా వందల రూపాయలు వసూలు చేసే ఆసుపత్రులకు భిన్నంగా ఈయన తన దగ్గరికి వచ్చే వారి నుంచి కేవలం 2 లేదా 5 రూపాయలు మాత్రమే తీసుకునేవారు. పూర్తి పేరు కృష్ణ వరదాచారి తిరువేంగడం. ఛాతీ వ్యాధుల నిపుణుడుగా గొప్ప పేరు సంపాదించారు. ఈ డాక్టర్ అత్యున్నత జ్ఞానానికి అందరూ వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్ అని పిలిచేవారు.

ఎన్నో విశిష్ట సేవలు అందించిన తిరువేంగడంను ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. 94 సంవత్సరాల వయసులో ఆరేళ్ళ క్రితం అనారోగ్యంతో ఈ లెజెండరీ వైద్యులు కన్ను మూశారు. తన జీవన ప్రయాణంలో ఈయన చూసిన ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు, విజయాలు అన్నీ దర్శకుడు జ్ఞానవేల్ చూపించబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇంకా అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు కానీ టాక్ అయితే గట్టిగానే ఉంది. సో సూర్యని మరో స్పెషల్ రోల్ చూడబోతున్నామన్న మాట.

This post was last modified on June 2, 2026 7:46 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

7 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

7 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

11 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

11 hours ago