Political News

ఆంధ్రాలో గద్దర్ విగ్రహం: పవన్ కల్యాణ్

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన ఆధ్వర్యంలో నవ నిర్మాణ సంకల్ప సభ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్నినిర్వహించాలని పవన్ తలచగా… అందుకు తెలంగాణ సర్కారుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంటి వద్ద మీడియా సమావేశాన్ని పవన్ ఏర్పాటు చేయగా… లోకల్ మీడియాతో పాటు జాతీయ మీడియా సంస్థలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చాయి.

ఈ సందర్భంగా తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. గద్దర్ గురించి మాట్లాడే హక్కు లేదని కొందరు నేతలు చేసిన విమర్శలను గుర్తు చేసుకున్న పవన్… అసలు తనకు గద్దర్ తో ఉన్న అనుబంధం గురించి మీకేం తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించిన పవన్.. గద్దర్ కు తానే కారు కొనిచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దరే తన వద్దకు వచ్చి మరీ కారు కొనివ్వాలని కోరారని… గద్దర్ కోరిన రెండు, మూడు రోజుల్లోనే ఆయనకు కారు కొనిచ్చానని పవన్ చెప్పారు.

ఈ సందర్భంగా పవన్ నాటి ఘటనను కళ్లకు కట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో జర్నలిస్టు కాలనీలోని జనసేన కార్యాలయానికి గద్దర్ వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. గద్దర్ ను గద్దరన్న అని తాను పిలుస్తానని, గద్దర్ తనను రేయి అని స్వేచ్ఛగా పిలుచుకుంటామన్నారు.

నాడు జనసేన కార్యాలయానికి వచ్చిన గద్దర్… తాను పడుతున్న ఇబ్బందిని తనకు చెబుతూ… “అరేయి తమ్మీ నా వెన్నులో బుల్లెట్లు దిగినయిరా. నడవాలంటే ఇబ్బందిగా ఉంది. ఆటోలో తిరగలేకపోతున్నాను. ఓ అన్నగా అడుగుతున్నాను. హక్కుగా అడుగుతున్నాను” అని పవన్ పేర్కొన్నారు. గద్దర్ అడిగిన వెంటనే ఆయనకు రెండు, మూడు రోజుల్లోనే కారు కొనిచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే… తెలంగాణలో ఏపీకి చెందిన ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నలకు పవన్ సూటిగానే స్పందించారు. ఏపీలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు. గద్దర్ తో తన అనుబంధాన్ని వివరిస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు పవన్ కు ఈ ప్రశ్నను సంధించారు.

తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఏపీలో గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించగలరా? అని ఓ మీడియా ప్రతినిధి పవన్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఏమాత్రం ఆసల్యం చేయకుండానే స్పందించిన పవన్ ఏపీలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సూటిగానే చెప్పేశారు. నా అన్నది నేను ఆవిష్కరిస్తా అని పవన్ సమాధానం ఇచ్చారు.

This post was last modified on June 2, 2026 6:55 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

8 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

10 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

10 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

13 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

14 hours ago