‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా విన్నర్ అనడంలో సందేహం లేదు. ‘ది ఘోస్ట్’ నెగెటివ్ టాక్‌తో అడ్రస్ లేకుండా పోగా.. ‘స్వాతిముత్యం’ మంచి టాక్ తెచ్చుకుని కూడా నిలబడలేకపోయింది. ‘గాడ్ ఫాదర్’పై విడుదలకు ముందు అంతగా బజ్ లేకపోయినా.. పాజిటివ్ టాక్‌కు తోడు, పోటీలో ఉన్న సినిమాలు ఫెయిలవడం కలిసొచ్చింది.
దసరా పండుగ రోజు, ఆ వీకెండ్ మొత్తం ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. కానీ ఆదివారం తర్వాత ‘గాడ్ ఫాదర్’ ఒక్కసారిగా డల్లయిపోయాడు. వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. తర్వాత రోజు రోజుకూ వసూళ్లు తగ్గడమే తప్ప పెరగలేదు. తమ సినిమాను సొంతంగా రిలీజ్ చేశామని, బయ్యర్లు నష్టపోవడం అన్న మాటే లేదని నిర్మాత ఎన్వీ ప్రసాద్ వివరణ ఇచ్చాడు కానీ.. సినిమాను అన్ని ఏరియాల్లో ఏమీ సొంతంగా రిలీజ్ చేయలేదు. నైజాం సహా కొన్ని ముఖ్య ప్రాంతాల్లో సినిమాను వేరే వాళ్లు కొన్నారు. కాబట్టి సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదన్నది వాస్తవం.
ఐతే వీక్ డేస్‌లో ఎంత వీక్ అయినప్పటికీ.. వీకెండ్లో మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఈ వారం చిన్నా చితకా సినిమాలు చాలానే ఉన్నాయి కానీ.. ఏదీ కూడా ‘గాడ్ ఫాదర్’ కంటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేది కాదు. మహా అయితే కన్నడ డబ్బింగ్ మూవీ ‘కాంతార’ మాత్రమే కొంచెం పోటీ ఇచ్చే స్థితిలో ఉంది. ఈ వీకెండ్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ మాత్రం ‘గాడ్ ఫాదరే’ అయ్యే అవకాశముంది. ఇంకే సినిమాలూ వారిని థియేటర్లకు రప్పించే పరిస్థితి లేదు. కాబట్టి చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్ తెచ్చుకోవడానికి చిరు సినిమాకు మంచి అవకాశాలున్నాయి.
వచ్చే వారం దీపావళి సినిమాల సందడి ఉంటుంది. ఓరి దేవుడా, జిన్నా, ప్రిన్స్, సర్దార్.. ఇలా నాలుగు పేరున్న చిత్రాలు వస్తున్నాయి. కాబట్టి ‘గాడ్ ఫాదర్’ ఎంత రాబట్టుకున్నా ఈ వీకెండ్ వరకే. ఆ తర్వాత సోమవారం నుంచి థియేటర్ల మెయింటైనెన్స్‌కు మించి ఆదాయం రావడం కష్టమే. మరి ఈ వీకెండ్‌ను చిరు సినిమా ఏమేర ఉపయోగించుకుంటుందో చూడాలి.
This post was last modified on October 14, 2022 11:36 am
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…