టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా.. టీడీపీతో ఎలాంటి సంబంధం లేని.. ఆయన తోడల్లుడు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు.. దగ్గుబాటి చెంచురామ్‌కు టీడీపీ టికెట్‌ను కన్ఫర్మ్ చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో గట్టి పట్టున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా.. ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు. అయితే.. తర్వాత.. వైఎస్ వ్యూహంతో ఈ కుటుంబం కాంగ్రెస్‌వైపు వెళ్లింది. పైగా.. టీడీపీలో ఏర్పడిన సంక్షోభంతో .. దగ్గుబాటి.. బయటకు వచ్చారు.
ఈ క్రమంలో పురందేశ్వరి.. కాంగ్రెస్ తరఫున 2009లో విశాఖ నుంచి విజయందక్కించుకుని..కేంద్రంలో మంత్రికూడా అయ్యారు. ఇక, రాష్ట్ర విబజన తర్వాత.. ఆమె బీజేపీకి జైకొట్టారు. అదేసమయంలో దగ్గుబాటి.. మాత్రం వైసీపీకి జైకొట్టారు. 2014లోనే ఆయన పరుచూరు నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి.. పరాజయం పాలయ్యారు. అయితే.. కొన్నాళ్లపాటు.. అనారోగ్య సమస్యలతో పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2019లో తన కుమారుడు.. చెంచురామ్‌కు పరుచూరు టికెట్‌ను ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీనికి జగన్ కూడా ఓకే చెప్పారు. అయితే.. ఎన్నికలకు ముందు వరకు కూడా.. చెంచురామ్‌కు విదేశాల నుంచి అనుమతులు రాలేదు.
ప్రస్తుతం చెంచురామ్ అమెరికాలో వ్యాపారం చేస్తున్నారు. అక్కడ ఆయనకు గ్రీన్ కార్డు కూడా ఉంది. కానీ, తన వారసుడిగా చెంచురామ్‌ను నిలబెట్టాలని.. దగ్గుబాటి ప్రయత్నిస్తున్నారు. అయితే.. 2019లో చెంచురామ్ రాలేక పోవడంతో.. దగ్గుబాటే పోటీ చేశారు. కానీ, ఆయన ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి సీఎం జగన్ కూడా ఆయనను దూరం పెట్టారు. ఎందుకంటే.. బీజేపీలో ఉన్న పురందేశ్వరి.. తరచుగా.. జగన్‌ను , వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా.. దగ్గుబాటి ఏమీ చేయలేకపోయారనే గుసగుస వైసీపీలో వినిపించింది. ఇక, ఇప్పుడు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు.. చంద్రబాబుకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
మరోవైపు.. వైసీపీలో.. దగ్గుబాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో చెంచురామ్‌కు చీరాల టికెట్ ఇస్తూ.. చంద్రబాబు నిర్నయం తీసుకున్నారని.. టీడీపీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీనిపై ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగాయని..తాజాగా.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అంటున్నారు. అయితే.. చీరాల ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ సీటే కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో సీనియర్ నాయకుడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. కరణం బలరాం..ఇక్కడ నుంచి గెలిచారు. అయితే..అనంతరం ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ టికెట్‌ను దగ్గుబాటి కుటుంబానికి కేటాయించడం.. ఆసక్తిగా మారింది.
This post was last modified on October 11, 2022 11:35 am
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…