జాగ్రత్త పడకపోతే సీఎం జగన్ కి సోకేది

ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను పడుకోబెట్టిన కరోనా తాజాగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కూడా సోకింది. ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయనడానికి చిహ్నంగా పెద్దలు కూడా దీని బారిన పడుతున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఆయన గన్ మెన్ కి కూడా కరోనా సోకినట్లు వెల్లడించారు.

కరోనా సోకినా అంజాద్ బాషా కు పెద్దగా లక్షణాలు లేకపోవడంతో హొం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అంజాద్ భాషా కడప ఎమ్మెల్యే. రేపు వైఎస్ జయంతి సందర్భంగా కడపలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక్క రోజు ముందు అంజాద్ కు కరోనా రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇదే వార్త రేపు బయటకు వచ్చింటే సీఎంకు కరోనా ప్రమాదం ఉండేదని… అదృష్టవశాత్తూ ఒక రోజు ముందుగా ఆయన కు టెస్టులు చేయడం మంచిదయ్యిందని అంటున్నారు.

హోంక్వారంటైన్ నేపథ్యంలో అంజాద్ భాషా లేకుండానే రేపు జగన్ పర్యటన జరగనుంది.మరో 28 రోజుల పాటు ఆయన గృహ నిర్బందంలోనే ఉంటారు. ఆయనకు ఇంకోసారి పరీక్షలు చేయనున్నారు. ఇంతకీ ఎలా బయటపడిందంటే.. సీఎం పర్యటన నేపథ్యంలో అందులో పాల్గొనబోయే ప్రజాప్రతినిధులకు‌, నేతలకు, పాత్రికేయులకు కరోనా టెస్ట్ లు నిర్వహించారు అధికారులు. టెస్టులు నెగెటివ్ వచ్చిన వారినే ఈ పర్యటనలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు.