తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకమాటన్నారు. అదేమిటంటే వైసీపీని ఓడించటానికి తన శతృవులతో కూడా కలుస్తానని. ప్రస్తుతం ఏపీ రాజకీయ పార్టీలను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని మాత్రమే పవన్ శతృవుగా భావిస్తున్నారు. మరి జగన్ ని ఓడించటానికి అవసరమైతే శతృవుతో కూడా చేతులు కలుపుతానని అనటం ఏమిటి ? పవన్ కు జగన్ కాకుండా ఇంకా శతృవులున్నారా ?
ఇపుడీ విషయంపైనే చర్చలు మొదలయ్యాయి. ఇపుడు జనసేన పరిస్దితి ఎలాగుందంటే బీజేపీ మిత్రపక్షమా కాదా అనేది కూడా అనుమానంగానే ఉంది. చెప్పుకోవటానికి బీజేపీ-జనసేన మిత్రపక్షాలే కానీ ఏ రోజూ కలిసి ఒక కార్యక్రమం కూడా చేసింది లేదు. జనసేన నిర్వహించే బహిరంగ సభలకు బీజేపీ నేతలను పిలవరు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సభలు, ఆందోళన కార్యక్రమాల్లో జనసేన ఎక్కడా కనిపించదు.
సో ఏదో రోజు రెండు పార్టీల మధ్య బంధం ఊడిపోయే ముక్కులాంటిదే అని అందరూ అనుకుంటున్నదే. ఈ నేపధ్యంలోనే చంద్రబాబునాయుడును కూడా పవన్ శతృవుగానే చూస్తున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే చంద్రబాబు శతృవైతే మరి మొన్నటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినిచ్చేది లేదని, ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని పదే పదే చెప్పిందెందుకు ? న్యూట్రల్ పార్టీలను కలుపుకుని పోరాటాలు చేస్తామనే ఎవరైనా చెబుతారు. అంతేకానీ అవసరమైతే శతృవులతో కూడా చేతులు కలుపుతామని చెప్పారు.
ఎందుకంటే శతృవులతో చేతులు కలపటానికి సిద్ధమయ్యారంటే ఇక వాళ్ళ మిత్రులే కానీ శతృవులు ఎలాగవుతారు ? హేమిటో పవన్ మాటలు ఒక పట్టాన అర్ధం కావు. ఎందుకంటే పవన్ మాటల్లో లాజిక్కుండదు, స్ధిరముండదు. ఈరోజు చెప్పిన మాట రేపు మరచిపోతారు. ఈరోజు చెప్పిన మాటకు విరుద్ధంగా రేపు మరోటి చెబుతారు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే పవన్ను జనాలు కూడా నమ్మకుండా దూరం పెట్టారు.. అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates