కాంగ్రెస్ బాటలోనే బీజేపీ

మూడు అంశాల్లో అచ్చంగా కాంగ్రెస్ విధానాలనే బీజేపీ కూడా ఫాలో అవుతోంది. ఇంతకీ ఆ  అంశాలు ఏమిటంటే మొదటిది కేంద్ర దర్యాప్తు సంస్ధలను ప్రయోగించటం. రెండోదేమో అవకాశమున్న రాష్ట్రాల్లో ప్రత్యర్ధి ప్రభుత్వాలను పడగొట్టేయటం. ఇక ఫైనల్ గా మూడో అంశం ఏమిటంటే ముఖ్యమంత్రులను మార్చేయటం. ఇపుడీ విషయం ఎందుకంటే మొదటిదేమో అవకాశం దొరకగానే మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసింది.

శివసేన+కాంగ్రెస్+ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి ఏక్ నాథ్ షిండే భాగస్వామ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే శివసేనలో కీలకనేత అయిన షిండేని పావుగా వాడుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసింది. సరే ఇపుడు బీహార్లో తాను అధికార భాగస్వామ్య పార్టీ నుండి ప్రతిపక్షంలోకి వచ్చేసింది. ఇక రెండో అంశాన్ని చూస్తే తరచూ ముఖ్యమంత్రులను మార్చటం. కర్నాటకలో బొమ్మై స్ధానంలో తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారనే ప్రచారం బాగా ఊపందుకుంటోంది.

బొమ్మై ముఖ్యమంత్రయి ఏడాది కూడా అయినట్లులేదు. ఇంతలోనే ముఖ్యమంత్రి మార్పు ఏమిటో అర్ధం కావటం లేదు. అంతకుముందు యడ్యూరప్పను దింపేసి బొమ్మైని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. వచ్చే ఏడాదిలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నది. అప్పటికి కొత్త ముఖ్యమంత్రి వచ్చేస్తారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే కర్నాటకలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత బలం నిజానికి బీజేపీ లేదు. కాంగ్రెస్, జనతాదళ్ ప్రభుత్వాన్ని కూల్చేసి తాను అధికారంలోకి వచ్చింది.

బొమ్మై స్ధానంలో యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలైన కేంద్రమంత్రి శోభా కరంద్లాజేనే కాబోయే ముఖ్యమంత్రంటు బాగా ప్రచారం జరుగుతోంది. యడ్యూరప్ప కారణంగానే శోభ కేంద్రమంత్రయ్యారట.  తాను సీఎంగా రాజీనామా చేయటానికి శోభను కేంద్రమంత్రివర్గంలో తీసుకోవాలని యడ్యూరప్ప షరతు విధించినట్లు ప్రచారం తెలిసిందే. ఇపుడు మళ్ళీ శోభ సీఎం అంటే యడ్యూరప్పే ముఖ్యమంత్రయినట్లు. గతంలో ఉత్తరాఖండ్ లో కూడా ఐదేళ్ళల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను బీజేపీ మార్చింది. ఇదే ఫార్ములాను కర్నాటకలో కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నట్లుంది. మరి కర్నాటకలో ఏమవుతుందో చూడాలి.