రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. పార్టీల మధ్య, నేతల మధ్య కూడా విమర్శలు కామన్. అయితే.. ఇవి కొంత వరకు హద్దుల్లోనే ఉండాలి. అంతకుమించితే.. ఇబ్బందులు తప్పవు. అయినాకూడా.. గతంలో కాంగ్రెస్-కమ్యూనిస్టులు-టీడీపీ-బీజేపీ నేతలు.. పరస్పరం విమర్శలు చేసుకునేవారు. కానీ, ఎప్పుడూ.. ఎవరూ.. అతి చేసుకున్న పరిస్థితి లేదు. అంతేకాదు.. ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఎదురు పడితే.. ప్రత్యర్థి పార్టీల నాయకులే అయినప్పటికీ.. ఆప్యాయంగా పలకరించుకునేవారు.
అంతేకాదు.. ఒకరి పిల్లల్ని మరొకరికి ఇచ్చి.. వియ్యం అందుకున్న పరిస్థితులు..కుటుంబాల మధ్య బం ధుత్వాన్ని కలుపుకొన్న నాయకులు.. కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు చిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నా యి. నాయకుల మధ్య పంతాలకు ప్రాధాన్యం పెరిగిపోతోంది. ప్రత్యర్థి పార్టీల మద్య పట్టింపులు పెరిగిపో తున్నాయి. నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకునే రాజకీయం కాస్తా.. వ్యక్తిగతానికి దారితీస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఏపీ విషయానికి వస్తే.. అధికార పార్టీ వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మధ్య తీవ్రస్థాయిలో రాజకీయం రగులుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇది ఎంత దూరం వెళ్లిందంటే.. టీడీపీ అధినేత చంద్రబా బుకు వైసీపీ అధినేత జగన్ ఎదురు పడలేని విధంగా మారిపోయింది. గతంలో అసెంబ్లీలోనూ ఇలానే వైసీపీ నాయకులు వ్యవహరించారు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం పంపిన ఆదేశం మేరకు జగన్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌కు హాజరు కావాల్సి ఉంది.
కానీ, ఇదే కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తుండడంతో ఏకంగా..జగన్ డుమ్మా కొట్టారు. దీనికి ఉన్న ఏకైక కారణం.. తాను ఈ కార్యక్రమానికి వెళ్తే.. చంద్రబాబుకు ఎదురు పడాల్సి వస్తుందనే! దీంతో జగన్ ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక, స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుమారుడి వివాహం జరిగింది. టీడీపీ నేతలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన వారికి కూడా ఆహ్వానాలు పంపాలని అనుకున్నారట. కానీ, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విరమించుకున్నారని.. శ్రీకాకుళం టాక్!!
ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. బీజేపీ నేతలకు ఎదురు పడకూడనే నిర్ణయానికి ఇక్కడి సీఎం కేసీఆర్ కూడా నిర్ణయించేసుకున్నారు. వారి మొహం చూడదని అనుకున్నారు. అందుకే.. ఆయన ఏకంగా.. అటు ఆజాదీ కార్యక్రమానికి,.. నీతి ఆయోగ్ కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు. నిజానికి గతంలో ఇంత పంతాలు పట్టింపులు ఉండేవి కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి-చంద్రబాబు కలిసి వేదిక పంచుకున్న సీట్లు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. బీజేపీ-కాంగ్రెస్ నేతలు.. కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. మరి ఇలాంటి పరిస్థితి మున్ముందు.. మంచిదేనా? అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on August 9, 2022 5:36 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…