ఏపీలోనే కాదు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలకు కారణమైంది వైసీపీ ఎంపీగా వ్యవహరిస్తున్న గోరంట్ల మాధవ్ కు చెందిన న్యూడ్ వీడియో బయటకు రావటం.. అది కాస్తావైరల్ గా మారటం ఒక ఎత్తు అయితే.. న్యూడ్ గా ఉన్న ఆయన చేసినట్లుగా చెప్పే చేష్టలు రాయలేనంతగా ఉండటం గమనార్హం. గోరంట్ల మీద చర్యలు తీసుకోవాలని.. అందుకు తగ్గట్లుగా ఆదేశించాలని కోరుతూ పలువురు విపక్ష నేతలు డిమాండ్ల మీద డిమాండ్లు చేయటం తెలిసిందే.
ఇలాంటివేళ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు.. ఆయనకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించే సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో మీద మాట్లాడారు. అయితే.. అందులో కనిపించిన వీడియోలో గోరంట్ల లేరన్నారు. అంతేకాదు.. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సంచలన కథనం చదివినా.. లేదంటే ఒకరి మీద ఆరోపణ వచ్చినప్పుడు.. దానికి సంబంధించిన ఫిర్యాదుదారు ఉండాలి కదా? అంటూ సజ్జలకు సమాధానం ఇచ్చారు.
గోరంట్ల వీడియో నిజమైనదా? లేదంటే తప్పుడు వీడియోనా? అన్నదే తేలిన తర్వాత అతడిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన సజ్జల.. వీడియో మీద రావాల్సిన రిపోర్టు సోమవారం సాయంత్రం చేరుకుంటుందని చెబుతున్నారని.. అందులో నిజం లేదన్నారు. వీడియోను పంపిన అరగంటకో.. గంటకో రిపోర్టు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారని.. కానీ.. రిపోర్టు ఇప్పటివరకు రాలేదని స్పష్టం చేశారు. గోరంట్ల వీడియో రిపోర్టులో తప్పు చేసినట్లు తేలితేనే చర్యలు ఉంటాయన్నారు.
గోరంట్ల వీడియో మీద మాట్లాడిన సజ్జల.. చంద్రబాబు కేసును బయటకు తీసుకురావటం.. అందులో పేర్కొన్న వాయిస్ తనది కాదని చెప్పడం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ఉన్నది చంద్రబాబే కదా? అని సందేహాల్ని ఏడేళ్లు అవుతున్నా తీర్చలేదని మండిపడ్డారు. ఆడియోలో ఉన్నది చంద్రబాబు వాయిసేనా..? కాదా? అనేది ఇంకా తేలాల్సింది ఉందన్నారు. మొత్తానికి గోరంట్ల స్పైసీ వీడియోకు.. ఓటుకు నోటు కేసు సందర్భంగా బయటకు వచ్చిన వీడియోలు తెగ వైరల్ గా మారాయని చెప్పక తప్పదు. అదే సమయంలో గోరంట్ల వీడియో ఎపిసోడ్ ముగిసిపోయినట్లేనన్న మాటను వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలతో గోరంట్లపై చర్యలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నట్లుగా సజ్జల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
This post was last modified on August 9, 2022 1:07 pm
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…