టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతోంది. గత శుక్రవారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుని తొలి వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టాయి. ఐతే రెండింట్లో ఎక్కువ పాజిటివ్ రివ్యూలు టాక్ వచ్చింది సీతారామం మూవీకే. కానీ తొలి వారాంతంలో వసూళ్ల పరంగా బింబిసార పైచేయి సాధించింది. సీతారామం మూవీకి తొలి మూడు రోజుల్లో రూ.10 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ వస్తే.. బింబిసారకు దాని కంటే రూ.8 కోట్లకు పైగా షేర్ ఎక్కువ వచ్చింది.
ఐతే మాస్ మూవీ కావడం వల్ల రిలీజ్‌కు ముందు నుంచే బింబిసారకు హైప్ ఉంది. తొలి రోజు పూర్తిగా ఆ చిత్రం ఆధిపత్యం చలాయించింది. కానీ తొలి రోజు సాయంత్రం నుంచి పుంజుకున్న సీతారామం.. శని, ఆదివారాల్లో దానికి దీటుగానే వసూళ్లు రాబట్టింది. ఇక వీకెండ్ అయ్యాక సీతారామం బాక్సాఫీస్ లీడర్‌గా అవతరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగులోనే కాక తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రానికి వసూళ్లు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ తర్వాత బింబిసార కలెక్షన్లలో డ్రాప్ కనిపించగా.. సీతారామం కలెక్షన్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈవెనింగ్, నైట్ షోలకు హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది సీతారామం. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఆ చిత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బుక్ మై షోలో బుకింగ్స్ చూస్తే మల్టీప్లెక్స్ స్క్రీన్లన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్, దాదాపు సోల్డ్ ఔట్ మోడ్‌లో కనిపించాయి.
ఇలాంటి క్లాస్ లవ్ స్టోరీలు బాక్సాఫీస్ దగ్గర నెమ్మదిగా పుంజుకోవడం.. ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడి స్థిరంగా వసూళ్లు రాబట్టడం మామూలే. అందులోనూ సీతారామంకు చాలా మంచి టాక్ రావడం, అందరూ దీన్ని క్లాసిక్ అంటుండడంతో సినిమా కొన్ని వారాల పాటు బాగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళం, మలయాళంలో తొలి రోజుతో పోలిస్తే వసూళ్లు బాగా పుంజుకున్నాయి. అక్కడ ఈ సినిమాను తొలి రోజు పట్టించుకోని ప్రేక్షకులు తర్వాత థియేటర్లకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
This post was last modified on August 9, 2022 12:23 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…