ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్.. ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రకటించడంపై మండిపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై మోడీని కేసీఆర్ నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించాలని కోరారు. కానీ, నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నానని ప్రకటించడం అంటే.. మోడీకి లొంగిపోయినట్టేనని రేవంత్ విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ వ్యవస్థలను టీఆర్ ఎస్, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఐబీ వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు మోడీ ఈడీ, సీబీఐని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, మోడీని ప్రజలు ఎవరూ నమ్మరని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్… ఒకే నాణెనికి బొమ్మబొరుసు వంటి వారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోడీపై విమర్శలు చేసినంత మాత్రన కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై…. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానిని నిలదీయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతల సూచనలను వింటున్నారా? నీతిఆయోగ్ సమావేశంలో మోడీని కేసీఆర్ నిలదీయాలి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి నీతిఆయోగ్‌లో నిలదీయాలి. నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లకపోతే చక్కని అవకాశం దుర్వినియోగం అవుతుంది. సమావేశానికి వెళ్లకపోతే మోడీకి కేసీఆర్ లొంగిపోయి ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. మోడీని ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోవద్దు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం.. అని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on August 7, 2022 12:06 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…