కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా తెర మీదే కాక, బయట కూడా అందాలు ఆరబోస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో తన తొలి చిత్రం ‘బేబీ జాన్’ ఖరారయ్యాక ఆమె లుక్స్ పూర్తిగా మారిపోయాయి. ఫొటో షూట్లలోనే కాక ఏదైనా ఈవెంట్లకు హాజరైనా సూపర్ గ్లామరస్ గా కనిపిస్తోంది కీర్తి. ఐతే ఎంత గ్లామర్ హీరోయిన్లయినా పెళ్లి తర్వాత డోస్ తగ్గించేస్తుంటారు. కొంచెం ట్రెడిషనల్ లుక్స్‌లోకి మారిపోతుంటారు.
కానీ కీర్తి మాత్రం తాను డిఫరెంట్ అని చాటుతోంది. ఆంటోనీని పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఆమె ‘బేబీ జాన్’ ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. ఆ ప్రమోషన్లలో తన లుక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హీరోయిన్లు తాళి ధరించి కనిపించడం అరుదు. కానీ కీర్తి మాత్రం ఆంటోనీ కట్టిన మంగళసూత్రాన్ని డిస్ ప్లే చేస్తూ కనిపిస్తోంది. అదే సమయంలో గ్లామర్ డోస్ తగ్గకుండా చూస్తోంది. మొన్న రెడ్ స్కర్ట్‌లో మంగళసూత్రం ఎలివేట్ అయ్యేలా ఆమె కనిపించిన తీరుకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.
కీర్తి ట్రెండ్ సెటర్ అని ఆ సందర్భంగా కొనియాడారు. ఆ తర్వాత కీర్తి ‘బేబీ జాన్’ టీంతో కలిసి ‘బిగ్ బాస్’ షోకు వెళ్లింది. ఆమెకు తోడుగా వచ్చిన మరో హీరోయిన్ వామికా గబ్బి కూడా సెక్సీగా తయారైనా సరే.. అందరి చూపూ కీర్తి మీదే నిలిచేలా ఆమె తన లుక్స్‌తో కీర్తి కట్టిపడేసింది. అక్కడ కూడా తన మంగళసూత్రం బాగా డిస్‌ప్లే అయ్యేలా చూసుకుంది కీర్తి. తనకు పెళ్లయిన విషయాన్ని గుర్తు చేస్తూనే ఇంత గ్లామరస్‌గా కనిపించడం కీర్తికే చెల్లింది. ‘బేబీ జాన్’ క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.