కొన్ని కొన్ని కామెంట్లు కొందరి నోటి నుంచి వస్తేనే సంచలనంగా మారుతుంది. ఇప్పుడు ఆ సబ్జెక్టుకు కూడా సార్ధకత చేకూరుతుంది. ఇప్పుడు ఇలాంటి కామెంట్లే చేశారు. బీజేపీ నాయకుడు, మాజీ టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్. మద్యం అమ్మి, భూములు అమ్మి.. రాష్ట్రాన్ని బాగు చేస్తరా.. అంటూ.. కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. తనదైన శైలీలో కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. మద్యం, భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని పాలించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి నిజాయతీ లేదన్న ఈటల… ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అధికారం కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానిం చారు. రైతు ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ, ఆచరణలో మాత్రం శూన్యమని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
రైతుల కళ్లల్లో మట్టిగొట్టి వారి జీవితాలతో ఆటలాడుతున్నారని ఈటల ధ్వజమెత్తారు. ఇప్పటికీ… కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు లేవని మండిపడ్డారు. ఉన్న కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత ఉందని తెలిపారు. ధాన్యం తూకాల్లో క్వింటాల్ బస్తాకు ఏడున్నర నుంచి పది కిలోల ధాన్యాన్ని కోత విధిస్తున్నారని విమర్శించారు. క్లారిటీ లేని హామీలు ఇచ్చి ప్రజల్ని అయోమయా నికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలుగా ఏం చేస్తారో అదే చెప్పాలని… ఓట్లు దండుకోవటానికి పూటకోమాట చెప్పకూడదని ఈటల పేర్కొన్నారు.
కేసీఆర్‌ది.. చక్రవర్తుల లెక్క!!
కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా?. మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా? బాగానే ఉన్న సచివాలయంను వాస్తు కోసం కూలగొట్టారు. ఇతర సీఎంల పేర్లున్న శిలాఫలకాలు ఉండొద్దని భావించారు. పూర్వం చక్రవర్తులు చేసిన పని ఇవాళ కేసీఆర్ చేస్తున్నారు. ఆచరణయోగ్యం కానీ హామీలను రాహుల్‌గాంధీ ఇచ్చారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ.40 వేల కోట్లు కావాలి. అన్నారు ఈటల.
టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదని ఈటల చెప్పారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు. మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా? అని మండిపడ్డారు.
This post was last modified on May 7, 2022 10:19 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…