Political News

నేష‌న‌ల్ పాలిటిక్స్.. కేసీఆర్ దూకుడు

భార‌త రాష్ట్ర స‌మితి.. పార్టీ ఏర్పాటు చేస్తే.. ఎలా ఉంటుందంటూ.. టీఆర్ ఎస్ ప్లీన‌రీలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన‌.. సీఎం కేసీఆర్‌.. 24 గంట‌లు కాక‌ముందే..  జాతీయ రాజ‌కీయ ముచ్చ‌ట్ల జోరును పెంచారు. తాజాగా ఆయ‌న జార్ఖండ్ యువ ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్‌తో ప్రగతి భవన్ లో బేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయ‌న‌తో  చ‌ర్చ‌లు జ‌రిపారు. జాతీయ రాజకీయాలు, కేంద్రం విధానాలు, ఇతర అంశాలు సమావేశంలో చర్చకు వ‌చ్చాయ‌ని.. స‌మాచారం.

మోడీని వ్య‌తిరేకిస్తున్న రాష్ట్రాల్లో.. జార్ఖండ్ కీల‌కంగా ఉంది. పైగా.. ఇక్క‌డ బీజేపీకి ప‌ట్టు కోల్పోయిన ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రింత దూకుడు పెంచి.. కేసీఆర్‌తో చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, దేశంలో సమూల మార్పు కోసం ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా ఉండాలంటూ.. టీఆర్ ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్ పేర్కొనడం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని అన్నారు.

దీంతో కేసీఆర్ పక్కాగా జాతీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే మాట జాతీయ స్థాయిలో హ‌ల్చ‌ల్ చేసింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు ప్రాంతీయ పార్టీల ముఖ్య‌మంత్రులు క‌దులుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్.. గత నెల 4 న జార్ఖండ్ రాజధాని రాంచీలో పర్యటించారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌కు రావాలంటూ.. సీఎం హేమంత్‌కు కేసీఆర్ ఆహ్వానం ప‌లికారు. ఈ క్ర‌మంలోనే యువ సీఎం హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

దేశ రాజకీయాలు, బీజేపీకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై కేసీఆర్.. హేమంత్ సొరేన్తో చర్చించారు.  ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌. మంత్రి కేటీఆర్‌, త‌దిత‌రులు హేమంత్‌కు ఘ‌న స్వాగతం ప‌లికారు. అనంత‌రం.. అంత‌ర్గ‌త మందిరంలో చ‌ర్చ‌ల‌కు దిగారు. హేమంత్ గౌర‌వార్థం  సీఎం కేసీఆర్ .. రాత్రి డిన్న‌ర్ ఏర్పాటు చేశారు.

This post was last modified on April 29, 2022 9:18 am

Share

Recent Posts

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

57 minutes ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

8 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

9 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

9 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

10 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

10 hours ago