హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై బాగా సిరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణ పిటీషన్ను చాలా సీరియస్ గా తీసుకుంటామని న్యాయమూర్తి శ్రీలక్ష్మిని తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకీ విషయం ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళ కాంపౌండ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే దీన్ని చాలెంజ్ చేస్తు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీన్ని విచారించిన కోర్టు వెంటనే స్కూళ్ళల్లో గ్రామ సచివాలయాలను, భరోసా కేంద్రాలను తొలగించాలని తీర్పు చెప్పింది. తొలగింపు సాధ్యం కాకపోతే కనీసం స్కూలుకు గ్రామ సచివాలయం, భరోసా కేంద్రాలకు మధ్య పార్టిషన్ వాల్ అయినా కట్టాలని ఆదేశించింది. అయితే స్కూల్ కాంపౌండ్ నుండి తొలగించలేదు, కనీసం పార్టిషన్ వాల్ కూడా నిర్మించలేదు. దాంతో సంబంధిత ఎనిమిది మంది ఐఏఎస్ లను కోర్టు పిలిపించి బాగా అక్షింతలేసింది.
కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు 12 ఆదివారాలు ఎనిమిది మంది సమాజ సేన చేయాలని ఆదేశించింది. అప్పుడు కోర్టు ఆదేశాలను అంగీకరించిన ఐఏఎస్ ల్లో తర్వాత శ్రీలక్ష్మి సమాజసేన చేయాలన్న ఆదేశాలపై పునఃసమీక్ష కోరుతూ కోర్టులో పిటీషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు శ్రీలక్ష్మిపై బాగా సీరియస్ అయ్యింది. అప్పుడు సమాజ సేవను అంగీకరించిన తర్వాత మళ్ళీ పునఃసమీక్ష కోరుతూ కోర్టులో పిటిషన్ వేయటం ఏమిటంటు మండిపోయింది. తమ ఆదేశాలను ఎనిమిది మంది ఐఏఎస్ లు కనీసం చదవను కూడా లేదని తెలియటంతో న్యాయమూర్తి ఆగ్రహం పట్టలేకపోయారు.
పునఃసమీక్ష పిటీషన్లో స్కూళ్ళ కాంపౌండ్లలో గ్రామ సచివాలయాలు, భరోసా కేంద్రాలను తొలగించినట్లు చెప్పటాన్ని కూడా తప్పుపట్టారు. కోర్టునే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసును రీఓపెన్ చేయబోతున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కోర్టు ఆదేశాలు అమలు చేయకుండానే చేసినట్లు తప్పుడు అఫిడవిట్ దాఖలు వేసిన ఫలితాన్ని ఇపుడు ఎనిమిది ఐఏఎస్ లు అనుభవించాల్సొస్తోంది.