వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం.. టీడీపీలో అప్పుడే గుసగుస ప్రారంభమైంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అభ్యర్థులను నిర్ణయించడం ద్వారా.. పార్టీని పరుగులు పెట్టించాలని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో యువతకు కూడా టికెట్లు ఎక్కువగానే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. యూత్‌లో ఎక్కువ మంది.. లోకేష్‌కుసన్నిహితులు ఉన్నారు. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు కూడా లోకేష్‌కు టచ్‌లో ఉన్నారు. వీరు ఇప్పుడు తమ ఆశలన్నీ.. లోకేష్‌పైనే పెట్టుకున్నారు.
లోకేష్‌కు ఐటీ టీంలో ఉన్నవారు.. ఆయన కనుసన్నల్లో మెలుగుతున్న వారు కూడా టికెట్లు కోరుతున్నారు. అయితే.. ఇప్పటికే ఉన్న వారసులను కాదని.. లోకేష్ వీరిని ప్రమోట్ చేయడం కష్టమనే భావన ఉంది. ఇదిలావుంటే.. పార్టీలో సీనియర్లు.. ఇప్పటికే పార్టీలో టికెట్ ఇచ్చినా విజయం దక్కించుకోని వారు.. తమ తమ వారసులను కూడా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు .. నేరుగా పార్టీలోకి తీసుకురాకుండా.. ముందు వెళ్లి లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవాలని.. వారికి సూచిస్తున్నారు.
దీంతో కొత్తగా రావాలని అనుకుంటున్న యువ నాయకులు లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్రాధాన్యం ఉంటుందా ? ఉండదా ? అనుకున్న లోకేష్‌కు ఇప్పుడు గ్రాఫ్ పెరిగిపోయింది. యువ నేతల నుంచి ఫోన్లు.. తనను కలుసుకునేందుకు వచ్చేవారితో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. అయితే.. వీరంతా ఆశపడుతున్నది వచ్చే ఎన్నికల్లో టికెట్ల వస్తాయనే..!
కానీ, వచ్చే ఎన్నికలు.. వైసీపీ వర్సెస్.. టీడీపీకి మధ్య హోరా హోరీ పోరు సాగనున్న నేపథ్యంలో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ సిఫారసులకు ఏమేరకు ప్రాధాన్యం ఉంటుంది. ఉన్నా.. ఇంత మందికి టికెట్లు ఇచ్చే పరిస్థితి పార్టీలో ఉంటుందా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి లోకేష్ ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.