ప‌నిచేయ‌క‌పోతే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వు: చంద్ర‌బాబు

త‌మ్ముళ్ల‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్లాస్ ఇచ్చారు. ప‌ద‌వులు ఇచ్చేందుకు తాను సిద్ధ‌మేన‌ని తెలిపారు. అయితే.. ప‌నిచేయాల‌ని.. అన్నారు. కేవ‌లం ప‌ద‌వులు అలంకార ప్రాయం.. ద‌ర్పం కోసం.. కాద‌ని.. ప‌ని చేసేందుకేన‌ని అన్నారు. పార్టీలో పదవులు తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించకుంటే.. చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ అనుబంధ విభాగాల పనితీరుపై సమీక్షించిన ఆయన.. ఘాటుగా మాట్లాడారు. రెండు, మూడు విభాగాలు తప్ప మిగతా అనుబంధ కమిటీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

ప్రజాసమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు   చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల సమీక్షలో మాట్లాడిన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీలోని 20 అనుబంధ విభాగాల బలోపేతంపై చర్చించారు. వాటి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానన్న ఆయన…, ప్రతి విభాగం మరింత క్రియాశీలకంగా ఉండాలని సూచించారు.

ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగితే ఉపయోగం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరెవరు ఏం పని చేస్తున్నారో తనకు మొత్తం తెలుసున్న బాబు.. పదవులు తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు.. కొంద‌రు ప‌ద‌వులు వ‌స్తేనే ప‌నిచేస్తాం.. అన్న‌ట్టుగా ఉన్నార‌ని.. ఇలాంటి చ‌ర్య‌లు స‌రికాద‌ని.. ప‌నిచేస్తే.. ప‌ద‌వులు కోర‌కుండానే వ‌స్తాయ‌ని.. ప్ర‌తి విష‌యాన్ని తాను రికార్డు చేస్తున్నాన‌ని.. ఎవ‌రు ప‌నిచేస్తున్నారు.. ఎవ‌రు చేయ‌డం లేదు..అ నే విష‌యాన్ని తాను చూస్తున్న‌ట్టు త‌లిపారు.

కొందరు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు విభాగాలు తప్ప మిగతా అనుబంధ కమిటీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అనుబంధ విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. అయితే.. ఎవ‌రైనా స‌రే.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మ‌రింత కృషి చేయాల‌ని.. ఏదో మీడియా ముందుకు వ‌చ్చి నాలుగు కామెంట్లు అనేసి వెళ్లిపోవ‌డం కాద‌న్నారు. పార్టీని క్షేత్ర‌స్తాయిలో బ‌లోపేతం చేయాల‌న్నారు. మ‌రి త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం ఏమేర‌కు ప‌నిచేస్తుందో చూడాలి.