తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కేటీఆర్… ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఈ పరిణామం నిజం అవడం సంగతి అలా ఉంచితే, ఎన్ని సార్లు వార్తల్లోకి ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఊహ ప్రచారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహాలు లేదా ఈ అంచనాను బలపరిచేలా కనిపించే సంఘటనలు దీనికి కారణం.
ఇక పాయింట్లోకి వచ్చేస్తే, ఒకింత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ప్రచారంలోకి వచ్చేందుకు కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వేదికగా మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ భగ్గుమంటోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేస్తోంది. అయితే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ భగ్గుమన్న సంగతి తెలిసిందే.
ఏకంగా రాజ్యాంగ మార్చాల్సిన అవసరం ఉందని స్పందించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే, తాజాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో స్వాగతం- వీడ్కోలు పలకకపోవడంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడం కావచ్చు.
అనంతరం తాజాగా తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలపై తన వైఖరిని తెలియజేయడం కోసం అయి ఉండవచ్చు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. పైగా ఈ అంశాలలో ఆయన తనయుడు కేటీఆర్ సర్వం తానై పార్టీ శ్రేణులకు, పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఓవైపు దేశ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్ ఆ పనుల్లో బిజీగా ఉండటంలో భాగంగా తనయుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించే ఎత్తుగడ మొదలుపెట్టారా అంటూ కొత్త చర్చ జరుగుతోంది.
This post was last modified on February 10, 2022 9:21 pm
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…