కృష్ణా జిల్లా గుడివాడ పోలీసుల అష్టదిగ్బంధంలోకి జారిపోయింది. ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నా రు. నగరంలో 144 సెక్షన్ కూడా విధించారు. దీనికి కారణం ఏంటి? అంటే.. సంక్రాంతి సందర్భంగా గుడివా డను అడ్డాగా చేసుకుని మంత్రి కొడాలి నాని..కేసినో సహా ఇతర జూదాలు ఆడించారు. గోవా తరహా కేసినో క్రీడను.. ఆయన తన సొంత కె-కన్వెన్షన్లోనే ఏర్పాటు చేశారు. ఎంట్రీఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు. దీనికి రాష్ట్రం నుంచే కాకుండా.. రాష్ట్రేతర వ్యక్తులు కూడా హాజరయ్యారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి.
రాష్ట్రాన్ని ఇప్పటికే.. అన్ని రకాలుగా భ్రష్టుపట్టించారని.. ఇప్పుడు ఏకంగా కేసినో జూదకు కూడా రాష్ట్రాన్నిఅడ్డాగా మార్చారని.. టీడీపీ నేతలు విమర్శించాఉ.. ఈ క్రమంలో చంద్రబాబు ఆదేశాల మేరకు అసలు గుడివాడలో ఏం జరిగిందనే విషయం తేల్చుకునేందుకు నిజనిర్ధారణ కమిటీని వేశారు. టీడీపీ నేతల నిజనిర్ధరణ కమిటీ పర్యటన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో…పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఎటు చూసినా.. పోలీసులే కనిపి స్తున్నారు. అసవరమైతే.. అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని పోలసులు చెబుతున్నారు. మరోవైపు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్యలతో కూడిన కమిటీ…గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. అనంతరం పూర్తి నివేదికను టీడీపీ అధిష్ఠానానికి ఇవ్వనుంది.
మరోవైపు గుడివాడలో క్యాసినో నిర్వహణపై తెలుగుదేశం నేత బొండా ఉమమహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం దిగజారిపోయి క్యాసినో ఆడిస్తారా అని ప్రశ్నించారు. డీజీపీ వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. నేటి నిజనిర్ధరణ కమిటీ పర్యటనలో గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి వివరాలు తీసుకుంటామన్నారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఇవన్నీ జరుగుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
డబ్బుల కోసం దిగజారిపోయి క్యాసినో ఆడిస్తారా. క్యాసినోపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కొడాలి నానిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే జరుగుతుంటే పట్టించుకోలేదు. కె కన్వెన్షన్లో జరిగినట్లు ఆధారాలతో సహా చూపిస్తాం. తూతూమంత్రంగా విచారణ జరిపితే న్యాయపోరాటం చేస్తాం.. అని ఉమా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ గుడివాడ పర్యటన ఏం తేలుస్తుందో చూడాలి.