Political News

కేటీఆర్ ఏం జ‌రుగుతోంది.. నేత‌ల‌ ఆందోళ‌న‌

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై పార్టీ నేత‌లు ఆందోళ‌న‌గా ఉన్నారు. ఇటీవ‌ల సంగారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌ ప్ర‌వ‌ర్తించిన తీరుపై గుర్రుగా ఉన్నారు. కేటీఆర్‌ వ్య‌వ‌హార శైలి త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును దెబ్బ‌తీసేలా ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని గులాబీ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు.

ఇటీవ‌ల సంగారెడ్డిలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని ప్రోత్స‌హించే విధంగా వ్యాఖ్య‌లు చేశారు. ఒక కార్య‌క్ర‌మంలో వేదిక పంచుకున్న జ‌గ్గారెడ్డితో కేటీఆర్ గుస‌గుస‌లాడ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్‌ను జ‌గ్గారెడ్డితో క‌లిసి ప‌ని చేయాల‌ని కేటీఆర్ కోర‌డం పార్టీ శ్రేణుల‌ను తీవ్ర గంద‌ర‌గోళంలో ప‌డేసింది.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న‌త‌ను గుర్తించ‌కుండా ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌కు ప్ర‌తిఫ‌లం ద‌క్కేలా కేటీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సంగారెడ్డిలో మెడిక‌ల్ క‌ళాశాల ఏర్పాటు చేస్తామ‌ని 2018 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని కేటీఆర్ ఆ క్రెడిట్‌ను జ‌గ్గారెడ్డి ఖాతాలో వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అసెంబ్లీలో అడిగిన వెంట‌నే సంగారెడ్డిలో మెడిక‌ల్ కళాశాల‌ను ఏర్పాటు చేశార‌ని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. కేటీఆర్ వ్యాఖ్య‌లతో తాము ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అదీ కాకుండా ప‌లు కార్య‌క్ర‌మాల‌కు త‌మ‌తో కాకుండా ప్ర‌త్య‌ర్థి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డితో శంకుస్థాప‌న చేయించ‌డం పార్టీ వ‌ర్గాల‌కు ఏమాత్రం రుచించ‌డం లేదు.

ఇదిలా ఉండ‌గా.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత‌టా గులాబీ పార్టీ చావు డ‌ప్పు కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. జిల్లా మొత్తం ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా సంగారెడ్డిలో మాత్రం ఎలాంటి స్పంద‌న లేద‌ట‌. కేటీఆర్ తీరుకు నొచ్చుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ దీనికి దూరంగా ఉన్నార‌ట‌. త‌న‌కు అనారోగ్యం ఉండ‌డం వ‌ల్లే దూరంగా ఉన్నాన‌ని ప్ర‌భాక‌ర్ చెబుతున్న‌ప్ప‌టికీ అభిమానులు మాత్రం ఏదో జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న‌గా ఉన్నార‌ట‌.

ఈ విష‌యంపై మంత్రి హ‌రీశ్‌రావును త్వ‌ర‌లో క‌ల‌వ‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అధిష్ఠానంతో ఏదో ఒక‌టి తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవాల‌ని భావిస్తున్నారా..? ఆయ‌న చేరితే పార్టీనే న‌మ్ముకున్న త‌మ ప‌రిస్థితి ఏమిటీ..? అదే జ‌రిగితే పార్టీలో కొన‌సాగే విష‌యం ఆలోచించుకోవాల్సి ఉంటుంద‌ని పార్టీ శ్రేణులు హెచ్చ‌రిస్తున్నాయ‌ట‌. మా ఎంపీ, ఎమ్మెల్యేల‌ను బాగా చూసుకోవాల‌ని కేటీఆర్ జ‌గ్గారెడ్డికి చెప్ప‌డం చూస్తే పార్టీని ఆయ‌న చేతిలో పెడుతున్నారా.. అని అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

This post was last modified on December 23, 2021 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావ‌లెను… !

ఏపీ ప్రతిప‌క్షం వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావాలా? పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు ర‌చించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసేందుకు ప్ర‌మోట‌ర్ల…

4 minutes ago

ముందు రోజు ప్రీమియర్లు….జెండా ఊపిన బచ్చల మల్లి!

కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…

16 minutes ago

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

1 hour ago

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…

1 hour ago

బేబీని టెన్షన్ పెడుతున్న పుష్ప 2?

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…

2 hours ago

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…

2 hours ago