వ్యవహారం చూస్తుంటే అనుమానంగానే ఉంది. దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో కేసీయార్ తో చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమ్మితం కేసీయార్ తన ఫ్యామిలితో కలిసి తమిళనాడుకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. తమిళనాడు పర్యటనలో రెండు అంశాలున్నాయి. మొదటిదేమో కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా మిగిలిన సీఎంల మద్దతు కూడగట్టడం. రెండోదేమో అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న మాజీ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను పరామర్శించటం. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన నరసింహన్ కుటుంబసభ్యులతో కేసీయార్ భేటీ అయ్యారు.
నరసింహన్ ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న కారణంగా ప్రత్యేకంగ ఆయన్ను పరామర్శించటం కేసీయార్ కు సాధ్యం కాలేదు. దాంతో ఆసుపత్రిలోనే ఉన్న కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు. తర్వాత సీఎం స్టాలిన్ ఇంటికెళ్ళారు. దాదాపు గంటన్నరపాటు ఇద్దరు సీఎంలు వాళ్ళ కుటుంబసభ్యులతో కలిసి మాట్లాడుకున్నారు. స్టాలిన్ తో భేటీ విషయంలో తెలంగాణాలో వరి కొనే విషయంలో కేంద్రం చూపిస్తున్న వివక్షపై కేసీయార్ మండిపడినట్లు సమాచారం. ఒక్క తెలంగాణా విషయంలో మాత్రమే కాదని మొత్తం దక్షిణాది రాష్ట్రాలపైనే నరేంద్ర మోడీ సర్కార్ వివక్ష చూపిస్తోందని ఆరోపణలు చేశారట. కాబట్టి ఈ వివక్షను సీఎంలు గుర్తించి ఐకమత్యంతో ఎదుర్కోవాలని సూచించారు.
కేంద్రంపై తన పోరాటానికి మద్దుతు కావాలని స్టాలిన్ను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతాబాగానే ఉందికానీ స్టాలిన్ ఏమో యూపీఏలో కీలకంగా ఉన్నారు. కేసీయార్ ఏమో అసలు యూపీఏకి దూరంగా ఉన్నారు. కేంద్రంతో పోరాటం చేయాల్సొస్తే యూపీఏ తరపునే స్టాలిన్ పోరాటం చేస్తారు కానీ కేసీయార్ తో ఎందుకు చేతులు కలుపుతారు ? పైగా కేసీయార్ ట్రాక్ రికార్డు తెలిసిన వాళ్ళెవరు గులాబీ బాస్ తో చేతులు కలపరు. ఎందుకంటే ఒకళ్ళతో పొత్తులని చెబుతునే, పొత్తులు ఉండగానే అవసరమైతే వెంటనే ప్లేటు ఫిరాయించేసి ప్రత్యర్ధులతో చేతులు కలిపేందుకు కేసీయార్ ఏమాత్రం వెనకాడరని చరిత్ర చూస్తే అర్ధమవుతుంది.
గతంలో కూడా మోడీకి వ్యతిరేకంగా ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ వాళ్ళిద్దరూ కేసీయార్ తో చేతులు కలపలేదు. మోడీతో ఇక యుద్ధమే అని హైదరాబాద్ లో ప్రకటిస్తారు వెంటనే ఢిల్లీ వెళ్ళి మోడీకి నమస్కారం పెట్టొస్తారు. ఇలాంటి నిలకడలేనితత్వం కారణంగానే కేసీయార్ కు ఎవరు మద్దతుగా నిలబడటం లేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరి తాజా భేటీ తర్వాత కేసీయార్ విషయంలో స్టాలిన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on December 15, 2021 12:13 pm
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…
వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార…
తెలుగు సినిమా చరిత్రలోనే బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ ఉండరంటే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ…
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ నెల 5న జరగనున్న ఎన్నికల కోసం అటు అధికార…
యుఎస్‌లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఆలస్యం.. చదువు, వృత్తి కోసం తమ దేశానికి వచ్చే విదేశీయుల విషయంలో…
కిర్లంపూడి పేరు వింటేనే… కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో…