చైనాకు చెక్.. ఎనిమిది దేశాలు చేతులు కలిపాయ్

ప్రస్తుత ప్రపంచంలో చైనా అంతటి తెంపరి దేశం మరొకటి లేదనే విషయాన్ని మెజారిటీ దేశాలు అంగీకరిస్తాయి. భారత్‌ను దెబ్బ తీయడానికి చైనా నుంచి సాయం పొందే పాకిస్థాన్ లాంటి ఒకటీ అరా దేశాలు మినహాయిస్తే చైనాను అన్నీ వ్యతిరేకించేవే. తన స్వప్రయోజనాల కోసం ఎవ్వరినైనా చిక్కుల్లోకి నెట్టడానికి ఆ దేశం వెనుకాడదు.

అభివృద్ధిలో తనకు దీటుగా ఉన్న, తనకంటే మెరుగ్గా ఉన్న దేశాల్ని దెబ్బ తీయడానికి చైనా ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటుంది. కరోనా వైరస్‌ను కూడా ప్రపంచం మీద బయో వార్ చేసే ఉద్దేశంతో చైనానే పుట్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందు చైనా ఎన్ని ఆగడాలు చేసినా భరించిన ప్రపంచ దేశాలు.. కరోనా ధాటికి జరిగిన నష్టంతో ఆ దేశంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఐతే వెంటనే ఆ దేశాన్ని కౌంటర్ చేసే పరిస్థితులు లేవు.

అనేక విషయాల్లో చైనా మీద ఆధారపడి ఉండటంతో ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు అమెరికా సహా చాలా దేశాలు వెంటనే చర్యలు చేపట్టలేకపోతున్నాయి. ఐతే నెమ్మదిగా అయినా చైనాతో సంబంధాలు కట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. చైనాను ఎలా కౌంటర్ చేయాలనే విషయమై ఎనిమిది అగ్ర దేశాలు చేతులు కలపడం గమనార్హం.
అందులో అమెరికా సహా అన్నీ బలమైన దేశాలే ఉన్నాయి.

యుఎస్ కాకుండా జర్మనీ, యూకే, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే దేశాల ప్రతినిధులు కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. ఇది కేవలం చైనాను కట్టడి చేయడానికి, ఆ దేశం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి ఏర్పాటైన కూటమి. ఇది ఇకపై చైనా మీద నిరంతరం నిఘా పెడుతుంది. ఆ దేశంతో నెమ్మదిగా సంబంధాలు కట్ చేసి దానిపై ఆధారపడే పరిస్థితి రాకుండా ఉండటానికి ఏం చేయాలో ప్రణాళికలు రచిస్తుంది. అలాగే చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టడంపైనా దృష్టిసారిస్తుందట. ఈ కూటమిలోకి వేరే దేశాలు కూడా రావచ్చని, లేదా పరోక్ష సాయం అందించవచ్చని.. మున్ముందు చైనాకు ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు.