రాజకీయాల్లో ఏం చేసినా.. వ్యూహాలు లేకుండా ఎవరూ అడుగులు వేయరు. ఇప్పుడు.. కూడా అధికార పార్టీ అధినేత, సీఎం జగన్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి. ఖచ్చితంగా.. జిల్లాల ఏర్పాటును చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. నిజానికి ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారు. అదేసమయంలో వేల కోట్ల రూపాయలు.. ప్రజలకు ఆయా కార్యక్రమాల కింద పంచారు. అయినప్పటికీ.. ఎక్కడో తేడా కొడుతున్న పరిస్థితి ఉంది. నిజానికి సంక్షేమ పథకాలు అంటే.. అందరికీ అందాలనే అవసరం లేదు.
ఎవరు అర్హులైతే.. వారికి ఆయా పథకాలను చేరువ చేస్తారు. దీంతో.. జగన్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం దక్కించుకోవాలంటే..ఖచ్చితంగా మరో వ్యూహంతో ముందుకు సాగాల్సిందే. ఈ క్రమంలోనే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అవే.. జిల్లాల ఏర్పాటు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని.. గత ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలోనేజగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వాటి ఏర్పాటుకు జగన్ అదికారంలోకి వచ్చిన వెంటనే ప్రయత్నించారు. మొత్తం ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో మరో 12 నుంచి 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
వీటికి స్థానికంగా సెంటిమెంటుతో కూడిన నేతల పేర్లు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇదే విష యాన్ని జగన్ తనపాదయాత్రలోనూ ప్రకటించారు. తద్వారా.. ఆయా ప్రాంతాల ప్రజల సెంటిమెంటు ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావించారు. అయితే.. ఇప్పటి వరకు దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. దీంతో కొత్త జిల్లాల ప్రతిపాదన ఎక్కడి కక్కడే ఉండిపోయింది. అయితే.. త్వరలోనే దీనికి ఒక కార్యాచరణ ప్రారంభించి.. వచ్చే ఆరు మాసాల్లోనే జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే.. ఇవి కొద్దిమందికే దక్కుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై ప్రజల కు ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. టీడీపీ అప్పుడే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యతిరేకత నుంచి బయటపడేందుకు.. వైసీపీ వ్యూహాత్మకంగా జిల్లాల ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లడం ద్వారా.. ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు అవకాశం ఉంటుందని.. భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates