Political News

కేంద్రాన్ని ఇలా నిల‌దీయండి.. ఎంపీల‌కు జ‌గ‌న్ డైరెక్ష‌న్‌

త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై సీఎం జ‌గ‌న్ వైసీపీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబ‌ట్టాల‌ని పేర్కొన్నారు. సుమారు మూడు గంట‌ల పాటు ఎంపీల‌తో భేటీ అయిన‌.. జ‌గ‌న్‌.. అన్ని విష‌యాల‌ను వారికి వివ‌రించారు. ప్ర‌స్తుతం రాష్ట్రానికి కీల‌కంగా ఉన్న స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌ని ఆయ‌న ఎంపీల‌ను కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల(రూ. 55,657) ఆమోదానికి కృషిచేయాలన్నారు. జాతీయ హోదా ప్రాజెక్టు క‌నుక అన్ని విష‌యాలు కేంద్రం బాధ్య‌త వ‌హించాల‌ని.. కానీ, ఎప్పుడూలేని విధంగా తాగునీటి అంశాన్ని విడదీసి చూస్తున్నారని, ప్రాజెక్ట్‌ పనుల్లో కాంపొనెంట్‌ వారీగా డబ్బులిస్తామని చెప్తున్నారని.. జ‌గ‌న్ తెలిపారు.

అదేస‌మ‌యంలో పోల‌వ‌రం విష‌యంలో ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లు కూడా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,104 కోట్లు ఖర్చుపెట్టిందని, ఆ డబ్బును రాబ‌ట్టాల‌ని ఎంపీల‌కు సూచించారు. అవ‌స‌ర‌మైతే.. గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత లేదన్న విష‌యాన్ని ఉభయ సభల్లో ప్రస్తావించాలన్నారు. ఏపీ సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,703 కోట్లు బకాయిలను తెచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

రాష్ట్ర విభజన తర్వాత మన విద్యుత్ కింద తెలంగాణ రూ. 6,112 కోట్ల బకాయి పడిందని, వీటిని ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ బకాయిలు కూడా వడ్డీ సహా ఇవ్వాల్సి ఉందని, ఎంపీలు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జ‌గ‌న్ సూచించారు. రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ అంశాన్ని కూడా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించానని, విభజన సమయంలో మొత్తంగా రీసోర్స్‌ గ్యాప్‌ రూ. 22, 948.76 కోట్లు అయితే ఇచ్చింది, రూ. 4,117.89 కోట్లు మాత్రమేన‌ని, దీనిపై కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు.

ఓవర్‌ బారోయింగ్‌ పేరుతో రుణాలు కత్తిరించడం అన్నది ఎప్పుడూ లేదన్న జ‌గ‌న్‌.,.. చంద్రబాబు హయాంలో చేసిన దానికి రుణాల్లో కత్తిరింపులకు దిగడం అన్నది సరికాదని, గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్‌బీసీలో కోత విధించడం సరి కాదని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించిందని దీనిపైనా కేంద్రాన్ని నిల‌దీయాల‌ని ఎంపీల‌కు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పరిమితికి మించి రుణం సేకరించిన విషయం అప్పటికే తేటతెల్లం అయిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదో నిల‌దీయాల‌న్నారు. రాష్ట్రంలో ఇటీవల వరదల సందర్భంగా అపార నష్టం ఏర్పడిందన్న జ‌గ‌న్‌..
వరద బాధితులను ఆదుకునేందకు తక్షణ సహాయంగా రూ.వేయి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామ‌ని, ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు కూడా రాశామ‌ని.. ఆ నిధులు ర‌ప్పించేలా చూడాల‌న్నారు. బీసీల అభ్యున్నతి దిశగా స్పష్టమైన కార్యాచరణకు దోహదపడేలా 2021 జన గణన సదర్భంగా బీసీ కులాల వారీగా జన గణన చేయాలని కోరామ‌ని, దీనికోసం ఒత్తిడి తీసుకు రావాల‌న్నారు.

ఉపాధి హామీ కింద రూ. 4976.51 కోట్ల బకాయిలు ఉన్నాయని, వీటిని విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పలుమార్లు లేఖలు రాశామ‌ని, పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా ప్రత్యామ్నాయాలను కూడా సూచించామ‌ని ఈ విష‌యంపై గ‌ట్టిగ‌గా ప్ర‌శ్నించాల‌ని ఎంపీల‌కు సూచించారు.

రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను తీసుకు వస్తున్నామ‌న్న జ‌గ‌న్‌.. ఇంకా 13 కాలేజీలకు అనుమతి రావాల్సి ఉందని… ఈ అంశాన్ని సభలో ప్రస్తావించాలని ఎంపీల‌కు సూచించారు. ఇళ్ల నిర్మాణం వల్ల ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల‌న్నారు. దిశ బిల్లు ఆమోదం ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాల‌న్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు పార్టీ తరఫున మద్దతు పలకాలన్నారు.

This post was last modified on November 26, 2021 8:55 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

3 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

5 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago