Movie News

500 కోట్లకు స్పైడర్ మ్యాన్ పరుగులు

కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా తగ్గిపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీక్ డేస్ నూన్,, మ్యాట్నీ షోలలో తగ్గుదల నమోదవుతున్నప్పటికీ ఈవెనింగ్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీలు బాగున్నాయి. నాలుగు వందల కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టిన సాలీడు మనిషి నెక్స్ట్ టార్గెట్ గా అయిదు వందల కోట్లను పెట్టుకున్నాడు. ఈ రోజుకీ గంటకు 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.

ఇక ట్రెండ్ ని గమనిస్తే ఫ్రెష్ రిలీజులు చాలానే అయ్యాయి కానీ వాటి ప్రభావం మరీ తీవ్రంగా అయితే స్పైడర్ మ్యాన్ మీద లేదు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఒక్క నోటెడ్ సినిమా లేకపోవడం బాగా ప్లస్ అవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనం ఎగబడి చూస్తున్నారు. దేశం మొత్తం మీద అత్యధిక ఫుట్ ఫాల్స్ వస్తున్న నగరంగా హైదరాబాద్ మొదటి స్థానం సంపాదించుకోవడం గమనార్హం. టికెట్ రేట్లు తక్కువగా ఉండటం, ఐమాక్స్ లేకపోవడం లాంటి కారణాల వల్ల గ్రాస్ లో నాలుగో ప్లేస్ దక్కింది.

తెలుగు విషయానికి వస్తే కొరియన్ కనకరాజు, డిసి, కెజెక్యూ చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు. వీటిలో మొదటి రెండింటికి వీకెండ్ దాకా ఢోకా లేదనే స్థాయిలో టాక్స్ ఉన్నాయి. మూడోది బజ్ కోసం ఇంకా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, యూత్ కి స్పైడర్ మ్యాన్ బెస్ట్ ఆప్షన్ అవుతున్నాడు. ఇప్పటికే అవతార్, అవెంజర్స్ రికార్డులను దాటేసిన సాలీడు మనిషిని అత్యధిక శాతం 3డి స్క్రీన్లలో విడుదల చేయడం వసూళ్ల పరంగా బాగా ప్లసయ్యి నెంబర్లు పెరిగాయి.

ఇంతా చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. పెదవి విరిచిన వాళ్ళు చాలానే ఉన్నారు. ఈసారి యాక్షన్ సరిపోలేదని, ఎమోషన్స్ కు ఎక్కువ చోటు ఇచ్చి బోర్ కొట్టించారనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇవేవి బాక్సాఫీస్ జోష్ ని తగ్గించడం లేదు సరికదా అంతకంతా స్టడీగా ఉంటోంది. దీని వల్లే మంచి ఊపులో ఉన్న ఒడిస్సి నెమ్మదించాల్సి వచ్చింది. ఏమైనా స్పైడర్ మ్యానా మజాకా అంటున్నారు హార్డ్ కోర్ అభిమానులు. 

This post was last modified on August 7, 2026 8:57 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

36 minutes ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

1 hour ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

2 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

3 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

3 hours ago