Trends

నా మొగుడ్ని యాక్సిడెంట్ చేసి చంపేయ్

నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్ చేయడం మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. భర్త ప్రాణం కోసం పోరాడిన సావిత్రి పుట్టిన నేల మీద ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్న భర్తలను కడ తెరుస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.

పొద్దున్న లేస్తే పేపర్ నిండా మొగుడ్ని చంపిన భార్యలు, ప్రియుడ్ని హత్య చేసిన ప్రియురాళ్ళకు సంబందించిన వార్తలే కనిపిస్తుండటం భయాందోళన కలిగిస్తుంది. ఈ దెబ్బకు పెళ్లిళ్లు చేసుకోవాలంటే మగ పిల్లలు హడలి పోతున్నారు. పెళ్ళీ వద్దు, గిల్లీ వద్దు, బతికుంటే బలిసాకు తినొచ్చని వేడుకుంటున్నారు. తలిదండ్రులు కూడా తమ కుమారుడికి పెళ్లి చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిన రోజులు వచ్చేసాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే…

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గ్రామానికి చెందిన గాదె రాజేశ్వర రావుకు 10 ఏళ్ళ క్రితం 2016లో భవానితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు వున్నారు. ఉపాధి కోసం ఖమ్మం జిల్లా ఏదులాపురంకు వచ్చి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. భవాని ఒక ప్రైవేటు హాస్పిటల్లో పనికి చేరింది. అక్కడ సైదులు అనే ఒక కొరియర్ బాయ్ తో పరిచయం ఏర్పడింది.

అదికాస్త వివాహేతరా సంబంధానికి దారి తీసింది. రాజేశ్వర రావు ఇంట్లో లేని సమయం చూసుకొని సైదులు నేరుగా ఇంటికి వచ్చిపోవడం మొదలుపెట్టాడు. ఇది ఆనోటా ఈనోటా పడి రాజేశ్వర రావుకు చేరింది. అప్పటికే భవాని ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త రాజేశ్వరరావు తీగలాగాడు. అంతే… భయంతో పోలీసులు వద్దకు పరుగులు తీసాడు.

అక్రమ సంబందానికి అడ్డుగా వున్న భర్త రాజేశ్వర రావును హత్య చేయిస్తే ప్రియుడు సైదులుతో స్వేచ్ఛగా సుఖ సంతోషాలు అనుభవించ వచ్చనుకున్న భవాని అందుకు ప్రియుడిపై ఒత్తిడి తీసుకొని రావడం మొదలు పెట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా తన భర్తను యాక్సిడెంట్ చేసి చంపమని, లేకుంటే నేను చచ్చిపోతానంటూ ప్రియుడ్ని బ్లాక్ మెయిల్ చేయసాగింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాటింగులు పరిశీలించిన రాజేశ్వరరావు సాక్ష్యాలతో సహా భార్య మీద డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మెసేజ్లు చూసిన పోలీసులు కూడా బిత్తర పోయారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.

This post was last modified on August 7, 2026 11:09 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

5 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago