Movie News

శ్రీలీల & జాన్వీ థ్రిల్లర్… హీరో కావలెను

సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు. సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూడటమే తప్ప అదెప్పుడు వస్తుందో అర్థం కాక అభిమానులు వర్రీ అవుతున్నారు. ఏదో ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు చేస్తుందని పెద్దిని నమ్ముకున్న జాన్వీకి దాని ఓవర్సీస్, బాలీవుడ్ వెర్షన్ ఫలితం షాక్ ఇచ్చింది. పైగా తన పాత్రని దర్శకుడు బుచ్చిబాబు డిజైన్ చేసిన తీరు హాట్ టాపిక్ గా మారిపోయి అసలు కంటెంట్ ని పక్కదారి పట్టించింది.

ఇక శ్రీలీల సంగతి సరేసరి. కెరీర్ మొత్తం మీద హీరోయిన్ గా నటించని భగవంత్ కేసరి ఒక్కటే ఆమెకు సూపర్ హిట్ గా నిలవగా మహేష్ బాబు నుంచి నితిన్ దాకా ఎందరితో జత కట్టినా పోటీ పడి మరీ ఫ్లాపులు పలకరించాయి. ఇప్పుడీ ఇద్దరి కలయికలో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు ఏక్తా కపూర్, గునీత్ మోంగా కపూర్. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయి మీద విపరీతమైన ప్రేమ పెంచుకునే పాయింట్ మీద అబ్సెషన్ తరహాలో రాసుకున్నారని టాక్.

పగలైట్, గ్యారా గ్యార ఫేమ్ ఉమేష్ బిష్త్ దర్శకత్వం వహించబోయే ఈ క్రైమ్ కం రొమాంటిక్ మూవీలో ఊహించని ట్విస్టులు చాలా ఉంటాయట. శ్రీలీల, జాన్వీ కపూర్ ఇద్దరికీ పెర్ఫార్మన్స్ పరంగా ఛాలెంజింగ్ గా అనిపించే అంశాలు బోలెడు ఉంటాయట. తన హిందీ డెబ్యూ కోసం శ్రీలీల రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందిన మూవీ అసలు రిలీజ్ ఉంటుందో లేదో ఆగిపోయిందో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు.

ఇక జాన్వీ విషయానికి వస్తే తను ప్రస్తుతం లగ్ లగ్ గలేలో నటిస్తోంది. ఇది వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇది కూడా ప్రతీకారం ముడిపడిన ప్రేమకథట. బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు భామలు కలిసి నటిస్తే అప్పుడైనా బ్రేక్ దొరుకుతుందేమో చూడాలి. బయట ప్రైవేట్ ఈవెంట్స్ లో తప్ప శ్రీలీల బొత్తిగా సినిమా ఫంక్షన్లకు రావడం మానేసింది. ఆఫర్లు తగ్గినట్టు అనిపిస్తున్నా అదేం లేదని మంచి కథల కోసం ఎదురు చూస్తోందని ఆమె సన్నిహితుల మాట. 

This post was last modified on August 7, 2026 9:36 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

1 hour ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

2 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

3 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

4 hours ago