ఈ రోజు ఒక సెన్సేషనల్ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచింది సమంత. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ పేరుతో ఆమె ఓ ఇంటర్నేషనల్ మూవీ చేయనున్న సంగతి వెల్లడైంది. హాలీవుడ్ మూవీ డౌన్ టౌన్ అబేను రూపొందించి ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ దర్శకుడితో సమంత కలిసున్న ఫొటో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది.
సమంత ఇంటర్నేషనల్ మూవీ చేయడమే విశేషం అంటే.. అందులో ఆమెది బై సెక్సువల్ రోల్ అనేసరికి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం సమంత ఆడిషన్ ఇచ్చి మరీ సెలక్ట్ అయిందట. తెలుగులో తన అరంగేట్ర సినిమా ఏమాయ చేసావెకు తాను ఆడిషన్ ఇచ్చానని.. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఆడిషన్ ఇవ్వడంతో ఏమాయ చేసావె రోజులు గుర్తుకు వచ్చాయని సమంత అంది.
ఈ సినిమాకు సమంత ఎంపిక కావడంపై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు కురుస్తుండగా.. సమంత కూడా చాలా ఎగ్జైటెడ్‌గా అందరికీ థ్యాంక్స్ చెబుతూ తన ఆనందాన్ని పంచుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఒక బాలీవుడ్ మీడియా సంస్థ నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో వేరే ఆర్టిస్టులతో కలిసి పాల్గొన్న సమంత.. 2021 తనకు చాలా కఠినమైన ఏడాదిగా పేర్కొనడం గమనార్హం.
అక్కినేని నాగచైతన్యతో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ అతడి నుంచి సమంత విడిపోయింది ఈ ఏడాదే. అందుకే ఆమె 2021ని కఠినమైన సంవత్సరంగా పేర్కొన్నట్లుంది. విడాకుల తర్వాత ఆమె చేస్తున్న తొలి చిత్రం కాదువాకుల రెండు కాదల్ డిసెంబరులోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 27, 2021 10:52 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…