నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలో ఒకింత ఇబ్బందిపాలైన టీడీపీకి ఇప్పుడు భారీ ఊరట లభిస్తోం ది. తాజాగా ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మిగిలిపోయిన మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. వీటిలో టీడీపీకి సానుకూల పరిణామాలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి కంచుకోట వంటి అనంతపురంలో 2019లో పోయిన ప్రాభవం తిరిగి లభిస్తోంది. ఇక్కడ ఎంపీటీసీ స్థానాల్లో సైకిల్ పరుగులు పెడుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలంలోని పడమటి పాలెం, బట్టేలంక స్థానాలను జనసేన కైవసం చేసుకుంది.
అనంతపురం జిల్లా శింగనమల మండలం వెస్టు నరసాపురం ఎంపీటీసీ ఎన్నికలలో 143 ఓట్ల మెజార్టీతో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం అనంతపురం ఎంపిటిసి టిడిపి అభ్యర్థి చిలకల చిన్న గోవిందు109 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ఓటమి పాలయ్యారు.
నెల్లూరు జిల్లాలోన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెముడుగుంట చంద్రమౌళి 806 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురం మండలంలోని అనంతమడుగు ఎంపీటీసీ లేపాక వెంకటరమణయ్య 270 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ యన వైసీపీ అభ్యర్థి.
అనంతపురం జిల్లా పరిగి మండలం శాసన కోట ఎంపీటీసీ ఎన్నికల రెండవ రౌండు ముగిసేసరికి 213 ఓట్ల మెజారిటీతో వైసిపి విజయం సాధించింది.
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జుటూరు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ లో మొదటి రౌండ్ పూర్తిఅయ్యేసరికి 4 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గజ్జయ్యగారి నాగిరెడ్డి గెలుపొందారు.
అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు ఎంపిటిసి ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పద్మాకర్ రెడ్డి 139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా.. దాదాపు టీడీపీ పరిషత్ ఎన్నికల్లో పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో సంతోషం కనిపిస్తోంది.
This post was last modified on November 18, 2021 1:45 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…