తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డెక్కారు. ఒకప్పుడు ఇందిరాపార్కును ఉద్యమ నేతలకు దూరం చేయాలని..తెలంగాణలో తెలంగాణ ప్రజల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అసలు ఉద్యమాలకు అవసరం ఏమొచ్చిందని చెప్పుకొచ్చి.. ఏకంగా ఇందిరాపార్కు వద్ద నిరసనలపై ఉక్కుపాదం మోపిన ఆయనే ఈ రోజు మెడలో పచ్చకండువా ధరించి.. రైతుల కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దీక్ష చేయనున్నట్టు ప్రకటించిన కేసీఆర్.. తన మంత్రులతో సహా వచ్చి.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే.. గతానికి ఇప్పటికీ.. నిరసన తీరును ఆయన మార్చారు. ఉద్యమం పాటలు ప్లే చేస్తూ.. మధ్య మధ్యలో ఆయనే యాంకరింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. “రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని మేం కేంద్రాన్ని కోరినం. కానీ, మా మాట వినిపించుకుంటలా! అందుకే.. మేం రోడ్డెక్కినం. అయితే.. దీనిని కూడా కొందరు దుష్మన్లు రాజకీయం చేస్తున్రు. ప్రభుత్వమే నిరసనలు చేస్తోందని అంటున్రు. అయితే.. వారిని నేను చెప్పేదొక్కటే.. మేం చేసేది కన్నా.. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నరేంద్ర మోడీనే అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 51 గంటలు రోడ్డెక్కారు. ఆయనే మాకు ఆదర్శం” అని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ ధర్నాలో అన్ని జిల్లాల నుంచి టీఆర్ ఎస్ నాయకులు.. జంపింగ్ నాయకులు కూడా వచ్చి చేరారు. అదేవిధంగా మంత్రులు జగదీశ్వరరెడ్డి, కేటీఆర్ తదితరులు కూడా సీఎం కేసీఆర్ ముందు కూర్చున్నారు. మధ్య మధ్యలో కేసీఆర్ మట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయాల కారణంగానే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారు. అదేవిధంగా మూడు రైతు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. ఈ పోరాటాన్ని గల్లినుంచి ఢిల్లీ వరకు కూడా విస్తరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పైకి చెబుతోంది ఒకటి.. చేస్తోంది మరొకటి.. అని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇవి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
అదేవిధంగా గత 50 రోజులుగా తాము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని.. అయినా.. పట్టించుకోవడం లేదని.. వ్యాఖ్యానించారు. ఇలాంటి మొద్దు ప్రభుత్వం నిద్ర లేపుదామనే తాము నిరసన చేస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలావుంటే.. మరోవైపు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ నేతలు.. ధర్నా చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని నాయకులు నిలదీశారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ లో మళ్లీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అయితే.. దీనిపై ఎలాంటి ఫలితం వస్తుందో చచూడాలి.
This post was last modified on November 18, 2021 12:31 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…