ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై కేంద్రంలోని ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయా? లేదా? అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? అని నిలదీసింది. మీరు సమాధానం ఇవ్వడం లేదంటే.. మత మార్పుడులు జరుగుతున్నాయన్న పిటిషనర్ల వాదనతో తాము ఏకీభవించాల్సి ఉంటుందని.. హెచ్చరించింది. ఇదే జరుగుతున్నట్టు భావిస్తే.. చర్యలకు ఉపక్రమిస్తామని.. నిజాలను దాచడం కూడా నేరమేనని.. స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్సీ కమిషన్ ఘాటు లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మత మార్పిడులపై నివేదిక ఇవ్వటంలో జాప్యం చేయటాన్ని తప్పుబట్టింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రాసిన లేఖలో.. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తోందని.. తమ దాకా వచ్చినా.. పట్టించుకోవడం లేదంటే.. రాష్ట్రంలో ఏదో జరుగుతోందని తాము భావించే పరిస్థితిని కల్పించినట్టేనని తెలిపింది. రిజర్వేషన్ల కోసం.. మత మార్పిడులు జరుగుతున్నా.. పట్టించుకోకపోవడం దారుణంగానే పరిగణిస్తామని.. దీనిపై పిటిషనర్లు లేవనెత్తిన అనేక సందేహాలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని.. లేఖలో స్పష్టం చేసింది.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని ఎస్సీ కమిషన్‌కు కొందరు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన కమిషన్.. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జూన్‌లో అప్పటి సీఎస్‌కు లేఖ రాసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో చెప్పాలని పేర్కొంది. అయితే.. గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ప్రబుత్వం కూడా దీనిని లైట్ తీసుకుంది. కానీ, రాజ్యాంగ బద్ధమైన కమిషన్ మరోసారి ఘాటుగా లేఖ రాసింది. ఎస్సీ కమిషన్ లేఖపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదో చెప్పాలని.. పేర్కొంటూ ప్రభుత్వంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎస్‌కు మరోసారి లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్…వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
రాష్ట్రంలో విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లోను, నెల్లూరు, కడప జిల్లాలోనూ.. కొందరిని ఎస్సీలుగా పేర్కొంటూ.. ప్రభుత్వ పథకాలను అమలు చేశారు. అయితే.. వీరంతా మత మార్పిడి చేయించుకున్నవారేనని.. ఎస్సీలుకారని.. పేర్కొంటూ.. కొందరు.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిలో టీడీపీ, జనసేన నాయకులు కూడా ఉన్నారు. వీరంతా సాక్ష్యాలతోపాటు.. ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై కొందరు మంత్రులు.. ఎదురు దాడి చేశారే తప్ప సమాధానం చెప్పలేదు. దీంతో వారంతా.. ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదులు చేశారు. దీనిపై ఇప్పటికే రెండు సార్లు విచారణ చేసిన కమిషన్ ప్రభుత్వ వాదన వినేందుకు జూన్‌లోనే లేఖ రాసింది. అయితే.. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు.
This post was last modified on November 17, 2021 9:26 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…