టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి రాష్ట్ర పోలీసులపై ఫైరయ్యారు. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశా రు. రాష్ట్ర పోలీసులు అనుసరిస్తున్న వ్యవహారంపై ఆయన ఫైరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన లేఖ రాశారు. “టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు” అని అన్నారు.
అంతేకాదు.. “సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్ట డం పోలీసుల నీతిమాలిన తనానికి నిదర్శనం. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే.. అరెస్టు చేస్తారా అంటూ గతంలో సుప్రీంకోర్టు పోలీసుల్ని హెచ్చరించింది.
దేశంలోని ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) నొక్కిచెబుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడం దుర్మార్గం“ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అయితే.. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత వేధించినా.. ప్రతి ఘటనకూ వడ్డీతో సహా చెల్లిస్తాం. టీడీపీ నేత సందీప్ పై వేధింపులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం విధించిన లక్ష్మణ రేఖలను మీరితే శిక్షలు తప్పవు.
ఈ విషయాన్ని గుర్తించి గురజాల సందీప్ మహదేవ్ ను తక్షణమే విడుదల చేయాలి. అని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాజా పరిణామాలే.. వైసీపీ, టీడీపీల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధంగా రగులుతుంటే.. ఇప్పుడు పార్టీ కార్యకర్తను అరెస్టు చేయడం.. మరింతగా రెండు పార్టీల మధ్య వివాదాన్ని రగిలించిందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై చంద్రబాబు యాక్షన్‌కు పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.
This post was last modified on October 23, 2021 9:15 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…