Political News

జగన్ కి కాపు సేన వార్నింగ్

పోసాని ప్రెస్మీట్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. జగన్ అభిమాని అని బహిరంగంగా చెప్పుకున్న పోసాని జగన్ కి సాయం చేయబోయి గట్టిగానే ఇరికించినట్టు తదనంతర పరిణామాల ద్వారా అర్థమవుతోంది.

పవన్ అభిమానులు తిట్టారు అనే నెపంతో వాళ్లు తిట్టిన తిట్లన్నీ పవన్ కళ్యాణ్ ని తిడుతూ మీడియా సమావేశం పెట్టారు పోసాని. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ మాట్లాడిన పోసాని మురళిపై జనసేన పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పవన్ ను అవమానించారంటూ పంజాగుట్ట పీఎస్ లో పోసాని పై జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఫిర్యాదు చేశారు. అయితే, సాయంత్రం ప్రెస్ మీట్ అనంతరం తనకేం అయినా పవన్ దే బాధ్యత అని, రేపు పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని పోసాని చెప్పిన విషయం తెలిసిందే.

ఇక పవన్ పై వైసీపీ నాయకుల వరుస మాటల దాడితో కాపు సంక్షేమ సేన తీవ్రంగా స్పందించింది. జనసేన అధినేత పవన్‌‌కళ్యాణ్‌పై వైసీపీ నేతల విమర్శలపై కాపు సంక్షేమ సేన లేఖ విడుదల చేసింది. కాపు మంత్రులు పవన్‌ను తిట్టడం వెనుక జగన్‌ హస్తం ఉందని కాపు సంక్షేమ సేన లేఖలో ఆరోపించింది. పవన్‌ను అవమానించడమంటే.. కాపు సమాజాన్ని అవమానపరచడమే అని పేర్కొంది. 2024 ఎన్నికల్లో వీటి పర్యవసానాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందని కాపు సంక్షేమ సేన జగన్ కి వార్నింగ్ ఇచ్చింది.

This post was last modified on September 29, 2021 6:16 am

Share

Recent Posts

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

28 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

1 hour ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

7 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

9 hours ago