Movie News

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి మ‌రీ సీరియ‌స్‌గా ఉండేది కాదు కానీ.. మంగ‌ళ‌వారం మాత్రం ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం వేడెక్కిపోయింది. సీఎం విజ‌య్, త్రిష‌ను ఉద్దేశించి ఒక వ‌ల్గ‌ర్ కామెంట్ చేసిన ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి స్టాలిన్‌ను త‌మిళ‌నాడు పోలీసులు అరెస్ట్ చేయ‌డం.. బ‌దులుగా డీఎంకే కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న నిర్వ‌హించ‌డం.. కోర్టు జోక్యంతో ఉద‌య‌నిధి విడుద‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇలాంటి టైంలోనే త‌న కొత్త సినిమా జి.డి.ఎన్ ఆడియో వేడుక పెట్టుకున్నాడు సీనియ‌ర్ న‌టుడు మాధ‌వ‌న్. ఈ చిత్రం శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో వేడుక‌లో మాధ‌వ‌న్ ఆస‌క్తిక‌ర ప్ర‌సంగం చేశాడు. బ‌య‌ట చాలా పెద్ద డ్రామా న‌డుస్తున్నా కూడా.. మీడియా వాళ్లు, అతిథులు ఇక్క‌డికి రావ‌డం గొప్ప విష‌య‌మ‌ని అత‌ను వ్యాఖ్యానించాడు.

అత‌నా మాట అన‌గానే స్టేజ్ మీద ఉన్న సీనియ‌ర్ నటుడు స‌త్య‌రాజ్ ఆశ్చ‌ర్యంగా చూశాడు. బ‌య‌ట జ‌రుగుతున్న డ్రామా వ‌ల్ల త‌న‌కు టెన్ష‌న్‌గా ఉంద‌ని.. రెండు రోజుల్లో త‌న సినిమా రిలీజ‌వుతుండ‌డంతో ఏమ‌వుతుందో అని గుండె గుబేల్‌మంటోంద‌ని మాధ‌వ‌న్ వ్యాఖ్యానించాడు.

జి.డి.ఎన్.. త‌మిళ‌నాడుకు చెందిన‌ లెజెండ‌రీ ఇంజినీర్ గోపాల‌స్వామి దొరైస్వామి నాయుడు బ‌యోపిక్. విదేశీ సాంకేతిక‌త‌ను అన్వ‌యించుకుని మోటార్ రంగంలో ఇండియాలో అనేక ఆవిష్క‌ర‌ణ‌లు చేసిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ఇండియాలో తొలి ఎల‌క్ట్రిక్ మోటార్ త‌యారుచేసింది ఆయ‌నే. మాధ‌వ‌న్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాను కృష్ణ‌కుమార్ రామ్‌కుమార్ రూపొందించాడు.

This post was last modified on August 4, 2026 11:18 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

22 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

40 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

48 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago