Political News

పవన్ పై పోసాని అగ్లీ వార్

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్‌ చేసిన వ్యాఖ్యల మంట ఇంకా మండుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద పవన్‌ చేసిన కామెంట్స్కి కౌంటర్‌‌ వేసేందుకు పోసాని సోమవారం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి కొనసాగింపుగా మరో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారాయన. మొదటి రోజు ప్రెస్‌మీట్ కాస్త బ్యాలెన్స్డ్‌గానే ఉన్నా.. రెండో రోజు మాత్రం ఆయన కాస్త కంట్రోల్‌ తప్పి మాట్లాడ్డం అందరినీ షాక్‌కి గురి చేసింది.

కూల్‌గానే మొదలుపెట్టిన పోసాని.. కాసేపటికి తిట్ల దండకం అందుకున్నారు. బూతులు మాట్లాడుతూ పవన్‌ మీద విరుచుకుపడ్డారు. నోటితో పలకడానికి, రాయడానికి వీలు కాని మాటలు ఆయన నోట్లో నుంచి రావడంతో అందరూ విస్తుపోయారు. వీధుల్లో కొట్టుకునేవారు సైతం ఈ స్థాయిలో మాట్లాడరు అని కొందరు కామెంట్ చేయడాన్ని బట్టి ఆయన ఎంతగా నోరు జారారో అర్థం చేసుకోవచ్చు.

పవన్‌ని రాజకీయ పరంగా విమర్శించడంలో తప్పు లేదు. ఆయన అన్న మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలోనూ తప్పేమీ లేదు. కానీ పవన్‌ చెడ్డవాడని నిరూపించే క్రమంలో భార్యాబిడ్డల్ని లాగడం మాత్రం సమంజసనీయం కాదు. పోసాని ఆ పని చేసి తన గౌరవాన్ని తనే తగ్గించుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కూతుర్ని సైతం ఆయన ఈ రచ్చలోకి లాగడం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోసాని మంచి రచయిత. మంచి భాషాజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన విమర్శించాలి అనుకుంటే బూతులే వాడక్కర్లేదు. అవతలివారు సమాధానం చెప్పలేని స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించగలరు. కానీ పవన్‌ని విజ్ఞతతో మాట్లాడమని చెప్పిన ఆయనే చివరికి విజ్ఞతను మర్చిపోయి లైవ్‌లో బూతులు మాట్లాడటం షాక్‌కి గురి చేసింది. కనీసం వాటిని ఎడిట్ కూడా చేయకుండా చానెల్స్‌ ప్రసారం చేయడంతో క్షణాల్లో దీనిపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

మొన్న పోసాని మాటలకు పీకే అభిమానులు మాత్రమే హర్టయ్యారు. మిగతావాళ్లు ఎప్పుడూ ఉండే గొడవలేగా అన్నట్టు చూసి వదిలేశారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకున్నారు. కానీ ఇప్పుడు పోసాని ఇంత దిగజారి మాట్లాడిన తర్వాత ఇది ఏ స్థాయికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్లి ఆగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

This post was last modified on September 29, 2021 6:12 am

Share

Recent Posts

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

20 minutes ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

46 minutes ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

1 hour ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

2 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

7 hours ago