Movie News

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా చేస్తున్న ప్రమోషన్లు మంచి బజ్ తీసుకొచ్చాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడం, కమెడియన్ సత్యతో చేయిస్తున్న వెరైటీ పబ్లిసిటీ జనాలకు రీచ్ అవ్వడం లాంటి కారణాలు ఏ మేరకు ఓపెనింగ్స్ తెస్తాయో చూడాలి. వరుణ్ తేజ్ పేరు మీద భారీ టికెట్లు తెగడం అంత ఈజీ కాదు. వరస డిజాస్టర్లు మార్కెట్ మీద ప్రభావం చూపించాయి.

అందుకే కంటెంట్ మీద ఫోకస్ పెట్టి దాని ద్వారా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ముందు రోజు ప్రీమియర్లకు టీమ్ రెడీ అవుతోంది. కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా ఏపీ తెలంగాణ ప్రధాన కేంద్రాల్లో షోలు వేయబోతున్నారు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించాడు. అంటే ఆరో తేదీ రాత్రే కొరియన్ కనకరాజుని థియేటర్లలో పలకరించి రావొచ్చు.

ఇక్కడ రిస్క్ లేకపోలేదు. ప్రీమియర్లు అంటేనే కత్తి మీద సాము లాంటివి. పాజిటివ్ టాక్ వచ్చిందా ఇబ్బంది లేదు. మార్నింగ్ షోల నుంచే పికప్ చూడొచ్చు. తేడా కొట్టిందా సోషల్ మీడియాలో మినీ యుద్ధమే చేయాల్సి ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీ ఇలాంటి మిక్స్డ్ రెస్పాన్స్ ని తట్టుకుని మరీ గెలిచింది. పాటలు, కథలో ఉన్న సోల్ యూత్ కి నచ్చడంతో సూపర్ హిట్ చేసేశారు. కనకరాజుకి అలాంటి అడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే అది కామెడీ ఎలిమెంటే.

దర్శకుడు మేర్లపాక గాంధీకి ఈ హిట్టు చాలా అవసరం. ఒకప్పుడు నాని శర్వానంద్ లాంటి స్టార్స్ తో పని చేశాక కెరీర్ హఠాత్తుగా డౌన్ అయిపోయింది. దాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే మెగా ప్రిన్స్ కి సక్సెస్ ని కానుకగా ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. బిజినెస్ పరంగా యువి క్రియేషన్స్ రిస్క్ లో లేదని సమాచారం. నాన్ థియేటర్ నుంచే మంచి ఆదాయం వచ్చిందట. థియేటర్స్ లో వర్కౌట్ అయితే మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ కావొచ్చని ఒక అంచనా. చూడాలి ఏం చేస్తుందో. 

This post was last modified on August 4, 2026 10:32 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago