ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో ఎంతో చేశామని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని చెప్పారు. అదేసమయంలో ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేశామని వివరించారు. సచివాలయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా వివరాలను వెల్లడించారు. ఆదాయం రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉందని, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండగా… ఏపీ రూ.93,903కు పడిపోయిందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో రూ.30,201 గ్యాప్ ఏర్పడిందన్నారు. ముఖ్యంగా రాజధానిని కోల్పోవడం వల్ల, ఎక్కువ జనాభా, తక్కువ ఆదాయ వనరులతో రాష్ట్రం ఏర్పడడంతో ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయిందని వివరించారు. ఈ పరిస్థితి నుంచి అభివృద్ధి చేసేందుకు కష్టపడుతున్నామన్నారు.
మరోవైపు 30.5 శాతం మేర సీఏజీఆర్ వృద్ధి జరిగిందని,.. ఇది చారిత్రాత్మకమని సీఎం చంద్రబాబు వివరించారు. “జీఎస్డీపీ 13.5 శాతంగా ఉంది. అప్పుల జీఎస్డీపీ రేషియో 28.38 శాతంగా ఉంది.అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగాం కాబట్టి.. ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న రిసోర్స్ గ్యాప్ 10 శాతం నుంచి 8 శాతానికి తీసుకురాగలిందని, 2 శాతం మేర గ్యాప్ తగ్గించా“మని చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పామన్న ఆయన.. బ్రాండ్ ఏపీని తిరిగి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చామన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించామని చంద్రబాబు చెప్పారు. వాటిని నెరవేరుస్తున్నామన్నారు.. ఎవ్వరూ ఊహించని విధంగా చెప్పిన విధంగా.. చెప్పిన తేదీల్లో సంక్షేమాన్ని అమలు చేస్తున్నా మన్నారు. “ఆదాయం రావాలంటే అభివృద్ధి రావాలి.. దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. సుస్థిరత కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం… కొత్త పాలసీలను ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో రెండేళ్ల పాలన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగు పడిందని ముఖ్యమంత్రి వివరించారు.
This post was last modified on August 4, 2026 9:37 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…