వైసీపీ వర్సెస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల మంటలు రేగాయి. సినిమా టికెట్ల విషయంలో చెలరేగిన వివాదం.. పవన్ వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య యుద్ధానికి దారి దీసింది. మంత్రులను సన్నాసి
అని వ్యాఖ్యానించడం.. పవన్ చేసిన తప్పిదమా? లేక.. నేటిరాజకీయాల్లో కామన్ అయిపోయిన వ్యాఖ్యలనే ఆయన చెప్పుకొచ్చారా ? అనేది పక్కన పెడితే.. మొత్తాని కి ఈవిషయాన్ని అధికార పార్టీ అయితే.. సీరియస్‌గానే తీసుకుంది. దీంతో మంత్రులువరుస పెట్టి లైన్‌లోకి వచ్చారు.. పవన్‌ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని… నేను కూడా కాపునే అంటూ..పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో ఇది కాపులకు అవమానకరంగా వుందనేది పెద్ద ఎత్తున చర్చ తెరమీదికి వచ్చింది. అయితే.. గతంలో ముద్రగడ పద్మనాభం కుటుంబానికి జరిగిన అవమానాన్ని మంత్రి ప్రస్తావించడాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. ఆ నాడు మీరు మాత్రంచేసిందేంటి? అనే చర్చ కూడా సాగుతోంది. అంటే.. మొత్తంగా ఇటు పవన్ చేసిన వ్యాఖ్యలు.. దీనికి కౌంటర్‌గామంత్రి పేర్ని చేసిన వ్యాఖ్యలు మాత్రం.. కాపుల మధ్యచర్చకు వచ్చాయి. కాపులకు ఇరు పక్షాలు తీవ్రస్థాయిలో అవమానిస్తున్నాయే వాదన అయితే… తెరమీదికి వచ్చింది.
కాపులు ఏం పాపం చేసుకున్నారు? టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు రెడీ అయింది.. ప్రభుత్వందీనిని అడ్డుకునేందుకు పవన్ వేరే మార్గం చూసుకుని ఉంటే బాగుండేదని..కులాలను తీసుకువచ్చి బద్నాం చేయడం ఎందుకు ? అనే వాదన కూడా వస్తోంది. మరీ ముఖ్యంగా కాపులకు ఎలాంటి ఊతం ఇవ్వకుండా.. ఈ కులాన్నిఅడ్డు పెట్టుకుని రాజకీయంగా విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నిక సమయంలో ఓట్ల కోసం తమను ఆశ్రయించే వారు.. ఇప్పుడుతమను టార్గటె్ చేయడం ఎందుకు? అనేది ప్రశ్న. అంతేకాదు.. గత ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ విషయం తెరమీదికి వచ్చిన ప్పుడు.. వీరు ఏమయ్యారు?
అప్పట్లో ఉద్యమాలు చేసినప్పుడు.. ఇటు పేర్ని కానీ.. అటు పవన్‌కానీ ఎందుకు మాట్లాడలేదు. కాపులకు రిజర్వేషన్ విషయంలో మౌనంగా ఉన్నవారు.. ఇప్పుడు వారిని కేంద్రంగా చేసుకుని.. నా.. కొ.. లు.. అనే తరహా లోవ్యాఖ్యలు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చ ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతుండడం గమనా ర్హం. దీనిపై త్వరలోనే కాపు నేతలు ఒక సమావేశం ఏర్పాటు చేసి.. తమ వైఖరిని వెల్లడించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
This post was last modified on September 28, 2021 10:06 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…