దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అది కూడా ఢిల్లీలోని స్థానిక రోహిణి కోర్టులో ఈ కాల్పు లు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లోమొత్తం.. నలుగురు మృతి చెందారు. వీరిలో కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ కూడా ఉండడం.. గ్యాంగ్ స్టర్ కేంద్రంగానే కాల్పులు జరగడం .. ప్రాధాన్యం సంతించుకుంది. మహారాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించి జితేంద్ర గోగిపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జితేంద్రకు ఢిల్లీలో కూడా లింకులు ఉండడంతో అతనిపై విచారణ రోహిణి కోర్టులో జరుగుతోంది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గోగిని.. పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రత్యేక విభాగం పోలీసులు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. అయితే.. రోహిణీ కోర్టులో జితేంద్రను హాజరు పరిచిన కొద్దిసేపటికే.. కొందరు దుండగులు.. న్యాయ వాదుల దుస్తుల్లో కోర్టులోకి ప్రవేశించారు. వాస్తవానికి.. పటిష్టమైన భద్రత ఉన్న రోహిణి కోర్టులోకి దుండగులు ఎలా ప్రవేశించారన్న విషయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వచ్చీరావడంతోనే.. జితేంద్ర లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోగ్యాంగ్ స్టర్ గోగి.. ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతను అక్కడ మృతి చెందాడు.
ఇక, వెంటనే తేరుకున్న పోలీసులు.. ఎదురు కాల్పులకు దిగారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు దుండగులు ప్రాణాలు విడిచారు. జితేంద్ర గోగీని వివిధ నేరాల కింద 2020లో అటు మహారాష్ట్ర, ఇటు ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు.
శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే దుండగులు 127 రూంలో జరుగుతునన విచారణ గదిలోకి న్యాయ వాద దుస్తుల్లో వచ్చి కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. కాగా, కాల్పులకు గ్యాంగ్ వారే కారణమని.. ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా నిర్దారించడం గమనార్హం.