ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ లో ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లను అమ్మాలనే నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నిర్ణయమపై మిశ్రమ స్పందన వస్తోంది. కాగా.. తాజాగా.. ఈ విషయం పై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు.
సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సిఎం జగన్ అమలు చేస్తూన్నారని ఎమ్యెల్యే రోజా పేర్కొన్నారు. వాళ్ళ నిర్ణయం మేరకే సిఎం జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. కాగా.. ఈ విషయం తెలియకుండా.. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చాలా భాథాకరమన్నారు.
ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతతో వదిలేస్తూన్నామని పేర్కొన్నారు ఎమ్యెల్యే రోజా. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కోడెలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ కూండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమైయ్యారని నిప్పులు చెరిగారు రోజా. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ ని చూసి నేర్చుకోవాలని హితువు పలికారు. అయ్యన్న పాత్రుడి ఎమ్మేల్యే పదవి పికేసారు… మంత్రి పదవి పికేసారు… చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పికేసారు… లోకేష్ జెండా పదివి పికేసారు… ఇంకా ఎం పికాలని రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.