దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు దొరికినట్లేనా ? సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ప్రకారం అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వివేకాను హత్యచేసినట్లుగా సీబీఐ స్పష్టంగా చెప్పింది. తమకు లభించిన ఆధారాల ప్రకారం పై ఇద్దరే వివేకాను హత్య చేశారనటానికి చాలా ఆధారాలున్నట్లు సీబీఐ చెప్పింది.
వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారం ప్రకారం దర్యాప్తు అధికారులు సునీల్ యాదవ్ ను అరెస్టుచేసి విచారించారు. వీరి విచారణలో ఉమాశంకర్ రెడ్డి పాత్ర బయటపడింది. ఈ ఉమాశంకర్ ఎవరంటే వివేకా పీఏ సోదరుడట. యాదవ్, ఉమాశంకర్ ఇద్దరు వివేకా హత్యకు ముందు వాళ్ళింట్లో కుక్కను మోటారు సైకిల్ తో గుద్ది చంపేసినట్లు సీబీఐ చెప్పింది. తర్వాత వివేకాను హత్య చేయటానికి వీళ్ళద్దరు పల్సర్ బైక్ లో గొడ్డలి తీసుకుని వెళ్ళారట.
వివేకా తలపై గొడ్డలితో నరికినట్లు పోస్టుమార్టమ్ లో తేలిన విషయాలను సీబీఐ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. హత్య తర్వాత ఉమాశంకర్ గొడ్డలిని తీసుకుని బైకులో పారిపోయాడట. తర్వాత విచారణలో భాగంగా సీబీఐ అధికారులు బైకును, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పోయిన నెలలో ఉమాశంకర్ ఇంట్లో సోదాలు చేసిన దర్యాప్తు అధికారులు రెండు చొక్కాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వివేకా హత్యకు సంబంధించి మరికొందరు నిందితులను, ఆయుధాలను మాత్రం స్వాధీనం చేసుకోవాల్సుందని సీబీఐ చెప్పింది.
అంతా బాగానే ఉందికానీ అసలు వీళ్ళద్దరు వివేకానందరెడ్డిని ఎందుకు హత్య చేశారనే విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. వివేకా సామాజికస్ధాయితో పోల్చుకుంటే వీళ్ళద్దరి ఏ విధంగా చూసినా సరితూగరు. అలాంటిది వీళ్ళకు వివేకాను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీటంలేదు. ఏదన్నా చిన్న విషయాల్లో విభేదాలొచ్చాయి అనుకున్నా వివేకాకున్న బ్యాక్ గ్రౌండ్ కారణంగా ఎవరు కూడా వివేకాతో విభేదించేందుకు సాహసించరు. అయినా హత్య జరిగిందంటే తెరవెనుక ఏమి జరిగిందో ? ఎవరున్నారో అర్ధం కావటంలేదు.
This post was last modified on September 11, 2021 10:26 am
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు…