తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చిన్నమ్మకు చెందిన దాదాపు రూ.100కోట్ల ఆస్తులను బినామీ చట్టం కింద ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది.
శశికళకు చెందిన ఆస్తులను ఆదాయ పన్ను శాఖ బుధవారం బినామీ లావాదేవీల నిషేధిత చట్టం కింద అటాచ్ చేసింది. చెన్నై శివార్లలోని పయ్యనుర్ గ్రామంలోని ఆస్తులను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. కాగా గత ఏడాది శశికళ, ఆమె సన్నిహితులకు చెందిన చెన్నైలోని దాదాపు 65 ప్రాపర్టీలను ఐటీ శాఖ అటాచ్ చేసింది.. రూ.100 కోట్ల విలువైన భూమిని అటాచ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
చిన్నమ్మకు ఐటీ శాఖ వరుసగా షాక్‌లు ఇస్తోంది కొద్దిరోజుల క్రితమే ఆమెకు పన్ను మినహాయింపు వర్తించదని ఝలక్ ఇచ్చింది. తాజాగా ఐటీ డిపాజిట్ ఆస్తుల నిరోధక చట్టం కింద శశికళ ఆస్తులను జప్తు చేశామని వెల్లడించారు. ఇప్పటికే శశికళకు చెందిన రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ ఇప్పటికే జప్తు చేసింది.
జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. 2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ వర్గాలు చిన్నమ్మను ఆదేశించాయి. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్‌ను శశికళ ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు.