ప్టాలిన్ పై పవన్ ట్వీట్.. తమిళనాడు అసెంబ్లీలో చర్చ..!

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పవన్ ట్వీట్ చేశారు. అయితే.. ఇప్పుడు అదే ట్వీట్..తమిళనాడు అసెంబ్లీలో పెద్ద చర్చకు దారితీయడం గమనార్హం. శాసన సభ లో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర మణియన్‌ ప్రసంగిస్తూ… ఈ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు.

ప్రతి పక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందరినీ భాగస్వాములను చేస్తూ… వారికి సముచిత గౌరవం కలిపిస్తూ.. పరిపాలన చేస్తుండడాన్ని పవన్‌ తన ట్వీట్‌ లో ప్రశంసించారు. ప్రభుత్వంలోని రావడానికి రాజకీయాలు చేయాలే తప్ప… అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదనే మాటలను చేతల్లో చూపిస్తున్నానని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ తమిళ నాడు శాసన సభ లో తమిళంలోపాటు తెలుగులోనూ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ అరుదైన ఘటన పై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.

పవన్ చేసిన ట్వీట్ లో ఏముందంటే..‘‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నారు. మీ పాలన, పనితీరు తమిళనాడు ఒక్క దానికే కాదు.. దేశంలోని మిగతా రాష్ట్రాలకూ, రాజకీయ పార్టీలకూ ఆదర్శం, మార్గదర్శి. అంత మంచి పాలన అందిస్తున్న మీకు మనస్ఫూర్తిగా అభినందనలు’’ అంటూ స్టాలిన్ ను ప్రశంసించారు.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ)గా ఏర్పడిన ఆ పార్టీ.. 159 సీట్లను గెలుచుకుంది. ఒక్క డీఎంకేనే 133 స్థానాల్లో విజయం సాధించింది. స్టాలిన్ ను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.