విజ‌య‌మ్మ స‌భ‌కు వెళ్తే మంట‌.. వెళ్ల‌క‌పోతే.. తంటా..

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. స‌తీమ‌ణి.. ఒక‌ప్ప‌టికీ కాంగ్రెస్ నేత‌ల‌కు వ‌దిన‌మ్మ‌.. అమ్మ‌.. అక్క అని ఆత్మీ యంగా పిల‌వ‌బ‌డిన‌ విజ‌య‌మ్మ పిలిచింది! వైఎస్ 12వ వర్ధంతికి అంద‌రూ రండి.. ఆయ‌న‌ను స్మ‌రించుకుం దాం! అని ఆహ్వానించింది. మ‌రి ఇప్పుడు వెళ్లాలా? వ‌ద్దా? చేవెళ్ల చెల్లెమ్మ‌.. స‌బితా ఇంద్రారెడ్డి నుంచి రాజ మండ్రి అన్న‌య్య‌.. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వ‌ర‌కు అంద‌రిదీ ఇదే ప్ర‌శ్న‌.. ఇదే అంత‌ర్మ‌థ‌నం. సెప్టెంబ‌రు 2 వైఎస్ పుష్క‌ర వ‌ర్ధంతి జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మం ఏటా నిర్వేహించేదే.కానీ, ఇప్పుడు మాత్రం విజ‌య‌మ్మ దీనిని హైలెట్ చేస్తున్నారు. ఇప్ప‌టికి 11 వ‌ర్ధంతులు జ‌రిగినా.. ఎప్పుడూ.. ఈ హ‌డావుడి లేదు.

స‌భ‌లునిర్వ‌హించింది లేదు.. సంస్మ‌ర‌ణ పేరుతో.. నేత‌ల‌ను ఒక‌చోట‌కు చేర్చింది లేదు. అయితే.. ఇప్పు డు ఎందుకు విజ‌య‌మ్మ ఇలా చేస్తున్నారు? అనేది ప్ర‌స్తుతానికి అయితే.. స‌స్పెన్స్ అనుకోవాల్సిందే. ఇక‌, అస లు ఈ స‌భ విజ‌య‌వంతం అవుతుందా? కాదా? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. వైఎస్ మంత్రి వ‌ర్గంలో ప‌నిచేసిన వారిలో చాలా మంది ఇప్పుడు.. వివిధ పార్టీల్లో ఉన్నారు. తెలంగాణ‌లో కావొ చ్చు.. ఏపీలో కావొచ్చు.. వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.. వేర్వేరు వ్యూహాల్లో ఉన్నారు. వీరిలో కొంద‌రు వైఎస్‌ను తిట్టిపోసే పార్టీల్లోనూ ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇప్పుడు వీరంద‌రినీ.. విజ‌య‌మ్మ ఒకే తాటిపైకితీసుకువ‌చ్చి.. స‌భ‌కు ర‌మ్మ‌ని పిల‌వ‌డం.. పైకి బాగానే ఉన్న‌ప్ప‌టికి.. అంత‌ర్గ‌తంగా చూసుకుంటే.. వైఎస్ తొలిసారి రాష్ట్ర హోం శాఖ ప‌గ్గాలు అప్ప‌గించిన స‌బిత నుంచి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పితాని స‌త్య‌నారాయ‌ణ‌(గ‌తంలో మంత్రి, ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు) వ‌ర‌కు కూడా ఎవ‌రూ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. స‌బిత వ‌స్తే.. వైఎస్‌ను క‌నీసం మాట మాత్రంగా అయినా.. పొగ‌డ‌కుండా ఉండ‌లేరు. ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌రకు టీఆర్ ఎస్ నేత‌లు.. వైఎస్ ను దొంగ అని.. రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని అని అన్న మాట‌ల‌ను ఆమె త‌ప్పు అని చెప్పిన‌ట్టే అవుతుంది.

అదేస‌మ‌యంలో టీడీపీలో ఉన్న నేత‌లు.. కూడా వెళ్లే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ఇప్పుడు.. వైఎస్‌ను పొగిడితే.. ఆయ‌న పాల‌నే అందిస్తున్నాన‌ని చెప్పుకొంటున్న ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని, పాల‌న‌ను నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్ధించిన‌ట్టే అవుతుంది. పోనీ.. రాజ‌కీయాల‌కు అతీతంగా రాజ‌శేఖ‌ర్‌ను కొనియాడు దామ‌ని అనుకున్నా.. అది కూడా సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటేనే రాజ‌కీయాల‌తో ముడిప‌డిన నాయ‌కుడు కావ‌డం. సో.. స‌భ‌కు వ‌స్తే.. ఖ‌చ్చితంగా ఆయ‌న‌ను పొగిడి తీరాల్సిందే.

ఈ విష‌యంలో వైసీపీ నాయ‌కుల‌కు ఇబ్బంది లేక పోవ‌చ్చు. ఎందుకంటే ఆ వేదిక‌గా.. వైఎస్‌ను పొగిడి.. వెంట‌నే జ‌గ‌న్‌ను పొగిడే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఇత‌ర పార్టీల నేత‌ల‌కు ఆ ఛాన్స్ లేదు. అలాగ‌ని అస‌లు స‌భ‌కు డుమ్మా కొడితే.. వైఎస్ పెట్టిన రాజ‌కీయ భిక్ష‌తో ఎదిగి.. ఇప్పుడు ఆయ‌న కార్య‌క్ర‌మానికి పిలిస్తే.. రాలేద‌నే యాంటీ ప్ర‌చారం జ‌రిగితే.. ఏం జ‌రుగుతుంది? అనేది కీల‌కంగా మారింది. రేపు విజ‌య‌మ్మ స‌మ‌యం చూసుకుని నాయ‌కుల‌ను ఎకేసే అవ‌కాశం కూడా ఉంది. పైగా.. వైఎస్ బొమ్మ‌తోనే రాజ‌కీయాలు చేశామ‌ని చెప్పుకొన్న వారు.. ఇబ్బందుల్లో ప‌డ‌తారు. సో.. విజ‌య‌మ్మ స‌భ స‌క్సెస్ అవుతుందా? కాదా? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. రాజ‌కీయాల‌కు త‌ట‌స్థంగా ఉన్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వంటివారు వెళ్లే అవ‌కాశం అయితే ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.