మరోసారి రాజ్యసభలో కన్నీరుపెట్టుకున్న వెంకయ్య..!

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు రాజ్యసభలో మరోసారి కంటతడి పెట్టుకున్నారు. నిన్న సభలో కాంగ్రెస్ ఎంపీలు పలువురు తీవ్రమైన గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ఎంపీల ప్రవర్తనపై తాను కలత చెందానని వెంకయ్య చెప్పారు. వారి ప్రవర్తన తీరుతో రాత్రి అసలు నిద్రపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఒకసారి వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెంకయ్య నాయుడు ఉద్దేశించి చేసిన ఆరోపణలకు కంటతడి పెట్టారు. కాగా.. వర్షాకాల సమావేశాలు మొదలైన దగ్గరనుంచి ఏ రోజు సభలు సజావుగా కొనసాగటం లేదు.. పలు పార్టీల ఎంపీ లు వారి స్థానిక సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యసభలో రైతుల సమస్యలపై చర్చ జరుగుతుండగా అంతా రచ్చ రచ్చ జరిగింది. దీంతో కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేయటం, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం వంటివి చేస్తూ అల్లరిగా ప్రవర్తించారు. దీంతో పాటు రూల్‌ బేక్‌ని చింపేసి గాల్లోకి విసిరేశారు. కొందు ఎంపీలైతే ఛైర్మన్ సీటుకు దిగువన పార్లమెంటరీ సిబ్బంది కూర్చొనే చోట.. టేబుళ్లపైకి ఎక్కి నిలబడ్డారు. దాదాపు గంటన్నర సేపు అక్కడే బైఠాయించారు.

అలా రాజ్యసభ సభ్యులు ప్రవర్తించిన తీరు పట్ల చాలా మనోవేదనకు గురయ్యానని, దానిని తలుచుకుంటే రాత్రుల్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో లోక్‌ సభ, రాజ్యసభ సభ్యులు అనుచిత ప్రవర్తన పట్ల రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి కన్నీటికి లోను కావటం పట్ల ప్రజలు ఎంపీల తీరు పట్ల మండిపడుతున్నారు.