ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా ప్రచారంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ (పీకే) తొందరలోనే కాంగ్రెస్ నేతగా పరిచయం కాబోతున్నారా ? కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పీకే తొందరలోనే కాంగ్రెస్ లో చేరి కీలక బాధ్యతలను చేపట్టబోతున్నట్లు జాతీయస్ధాయిలో జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిదే. సరే అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ నేతగా పీకే సక్సెస్ అవుతారా ? అనే చర్చ ఇపుడు పెరిగిపోతోంది.
విషయం ఏమిటంటే రాజకీయ విశ్లేషకుడి అవతారం వేరు నేరుగా రాజకీయ నేతగా అవతారం ఎత్తడం వేరన్న విషయం అందరికీ తెలిసిందే. రెండింటికి చాలా తేడా ఉంది. అదేమింటే రాజకీయ విశ్లేషకుడంటే ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే పీకే చెప్పినట్లు వినాల్సిందే. పీకే ఒకటిచెప్పి పార్టీ అదినేత మరోవిధంగా నడుచుకుంటే వ్యూహకర్త వ్యూహాలు అమలు అయ్యే అవకాశాలు లేకపోతే పార్టీ గెలుపుపై ప్రభావం చూపటం ఖాయం. అలాగే పార్టీ అధినేతతో తప్ప పీకే ఇంకెవరితోను మాట్లాడరు. కాబ్టటి పీకే ఎప్పుడనుకుంటే అప్పుడు అధినేత మాట్లాడాల్సిందే. ఎందుకంటే వందల కోట్ల రూపాయలిచ్చి కోరి తెచ్చుకున్నారు కాబట్టి.
ఇక నేరుగా ఓ పార్టీలో చేరటమంటే కత వేరేరకంగా ఉంటుంది. ఎలాగంటే అనేక మంది నేతల్లో పీకే ఒకరైపోతారు. కాకపోతే చాలామంది నేతలకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దొరికినా అన్నీసార్లు అలా దొరకదు. కాబట్టి పార్టీ అధినేత దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే. పైగా పీకే సలహాలతో విభేదించే వారు పార్టీలో చాలామంది నేతలు రెడీగా ఉంటారు. ఎందుకంటే సీనియర్ నేతల్లో ఎవరి ఆధిపత్యం ప్రకారం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి.
మరీ విషయాలు పీకేకి తెలీకుండానే ఉంటుందా ? పైగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉంది. ఏదో పార్టీ ఉందంటే ఉంది చాలా రాష్ట్రాల్లో. ఇలాంటి పరిస్ధితుల్లో పీకే చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభం వచ్చేస్తుందని చెప్పటం కష్టం. నరేంద్రమోడి మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయి జనాలు తమంతట తాముగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనే పార్టీకి జీవం వస్తుంది. ఇన్ని క్లిష్ట పరిస్ధితుల్లో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on July 21, 2021 11:21 am
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…