Political News

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల‌పై అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్ర‌యోగించారు. ఇక‌, గిరిజ‌న, ఆదివాసీలు నివ‌సించే తండాల‌పైనా త‌న ప‌ట్టును కొన‌సాగిస్తున్నారు. త‌ర‌చుగా ఆయా ప్రాంతాల్లో స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. పరిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలానే.. కేంద్రం ఇస్తున్న నిధుల‌ను కూడా నేరుగా గ్రామీణ ప్రాంతాల‌కే అందిస్తున్నారు.

ఇలా..త‌న‌దైన శైలిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఇక‌, ఇప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంపై మ‌రో వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వాస్త‌వానికి గ‌త 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. పిఠాపురంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. పండుగులు, శ్రావ‌ణ మాసాలను పుర‌స్క‌రించుకుని ప‌ట్టుచీర‌లు పంపిణీ చేయ‌డం.. సంప్ర‌దాయ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం వంటివి తెలిసిందే.

అయితే.. పిఠాపురాన్ని మ‌రింత డెవ‌ల‌ప్ చేయాల‌ని భావిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ‘పిఠాపురం ప్రాంతీయ అభివృద్ధి అథారిటీ(పీఏడీఏ)’ పేరుతో ప్ర‌త్యేక సంస్థ‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజధాని ప్రాంతీయ అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) ఎలా ప‌నిచేస్తుందో.. పీఏడీఏ కూడా అలానే ప‌నిచేస్తుంది. ఈ సంస్థ‌కు కూడా నిధుల వినియోగం నుంచి ప‌నులు చేయించ‌డం వర‌కు బాధ్య‌త‌లు ఉంటాయి. అంతేకాదు.. అభివృద్ధికి సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది.

ఏం చేస్తారు.. ?
కేంద్రం నుంచి వ‌స్తున్న పంచాయ‌తీ నిధుల‌ను నేరుగా గ్రామీణ ప్రాంతాల‌కు అందించిన‌ట్టే.. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నిధుల‌ను నేరుగా పీఏడీఏకు బ‌దిలీ చేస్తారు. దీనికి ప్ర‌త్యేకంగా ఒక డిప్యూటీ క‌లెక్ట‌ర్ స్థాయి అధికారిని ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా నియ‌మిస్తారు. ర‌హ‌దారులు..మౌలిక స‌దుపాయా లే కాదు.. పిఠాపురాన్ని ప‌ర్యాట‌క ప్రాజెక్టుగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్రంలో ఒక నియోజ‌క‌వర్గం అభివృద్ధి కోసం.. ప్ర‌త్యేకంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 17, 2026 1:44 pm

Share

Recent Posts

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

10 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

1 hour ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

1 hour ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago