Political News

టీడీపీ వియ్యంకులు జంపేనా…!

వాళ్లిద్దరూ వియ్యంకులు. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అడ్ర‌స్ లేరు. అస‌లు టీడీపీలో వాళ్ల గురించి ఎవ్వ‌రికి తెలియ‌దు. అయితే 2014లో టిడిపి అధికారంలోకి వ‌చ్చాక ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పారు. పైగా ఇద్ద‌రు మంత్రులుగా మామూలు హ‌వా చెలాయించ‌లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయింది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలో ఎందుకు యాక్టివ్‌గా ఉండ‌డం… టైం వేస్ట్ అనుకున్నారో ఏమోగాని.. అసలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. ఆ ఇద్ద‌రు టీడీపీ వియ్యంకులు ఎవ‌రో కాదు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు.. పొంగూరు నారాయ‌ణ‌. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు వీళ్లు ఏ మాత్రం క‌ష్ట‌ప‌డ‌లేదు. పైగా అప్పుడు గంటా కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో గంటా టీడీపీలోకి వ‌చ్చారు. ఆ వెంట‌నే పార్టీ గెల‌వ‌డంతో మంత్రి అయ్యారు. ఐదేళ్లు ఆయ‌న ఓ వెలుగు వెలిగారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు నుంచి పోటీ చేసిన నారాయ‌ణ ఓడిపోయారు. గంటా విశాఖ నార్త్‌లో స్వ‌ల్ప తేడాతో గెలిచారు. నారాయ‌ణ అస‌లు ఓడిపోయాక అడ్ర‌స్ లేకుండా పోయారు. దీంతో నెల్లూరు సిటీకి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఇన్‌చార్జ్‌గా బాబు నియ‌మించేశారు. నారాయ‌ణ పార్టీని ప‌ట్టించుకుంటారు ? అన్న న‌మ్మ‌కం కూడా ఎవ్వ‌రికి లేదు. ఇక నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఎప్పుడు గోడ‌దూకేద్దామా ? అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అస‌లు ఆయ‌న నార్త్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే ఇటీవల జీవీఎంసీ ఎన్నిక‌ల్లో కూడా పార్టీ నార్త్ నియోజ‌క‌వ‌ర్గంలో చిత్తుగా ఓడింది.

ఇక వీరిద్ద‌రు వ్యాపారులు కూడా కావ‌డంతో అధికార ప‌క్షంపై కిమ్మ‌న‌డం లేదు. నోరు ఎత్తి చిన్న విమ‌ర్శ కూడా చేయ‌డం లేదు. పార్టీ ఓడితే మాకెందుకు.. మా వ్యాపారాలు మావి అన్న చందంగా వీరి వ్య‌వహార శైలీ ఉంది. రాజధాని వ్య‌వ‌హారాల్లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన నారాయ‌ణ‌ను ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం గ‌ట్టిగా టార్గెట్ చేస్తోంది. అందుకే ఆయ‌న సైలెంట్ అయిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న కుమార్తె సైతం సీఎం స‌తీమ‌ణి భార‌తిని క‌లిసింద‌ని టాక్ ?

ఇక గంటా ముందు నుంచి అధికారం ఎక్క‌డ ఉంటే అక్క‌డ వాలిపోతుంటారు. ఇప్పుడు కూడా ఆయ‌న‌కు సరైన ఛాన్స్ రావ‌డం లేదు కాని.. వైసీపీ నుంచి మంచి ఆఫ‌ర్ ఉంటే చ‌క్కేసినా పెద్ద ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు ఈ వియ్యంకులు ఇద్ద‌రిని కూడా చంద్ర‌బాబు న‌మ్మే ప‌రిస్తితుల్లో లేర‌నే టీడీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఒక వేళ గంటా కూడా ఎన్నిక‌ల‌కు ముందు అటూ ఇటూ చూసి జంప్ అయితే అక్క‌డ కూడా మ‌రో బ‌ల‌మైన నేత‌ను మ‌నం రెడీ చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌తో అన్న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on July 19, 2021 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

11 minutes ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

22 minutes ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

1 hour ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

1 hour ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

2 hours ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

2 hours ago