Movie News

ర‌జినీ కోసం ఒట్టు తీసి గ‌ట్టున పెట్టాడు

కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన విజ‌య్ సేతుప‌తి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే. పుష్ప లాంటి సినిమాలో విల‌న్ పాత్ర ఆఫ‌ర్ చేస్తే డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌ దాన్ని తిర‌స్క‌రించే స్థాయి ఆయ‌న‌ది. బ‌హు భాష‌ల్లో న‌టిస్తూ ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న న‌టుల్లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు సేతుప‌తి. ఐతే గ‌తంలో సేతుప‌తి ప్ర‌త్యేక పాత్ర‌లు, గెస్ట్ రోల్స్, క్యామియోలు బాగానే చేసేవాడు.

కానీ ఈ మ‌ధ్య మాత్రం అలాంటి పాత్ర‌లు త‌గ్గించేశాడు. ఎక్కువ‌గా హీరోగానే న‌టిస్తున్నాడు. అప్పుడ‌ప్పుడూ విల‌న్ పాత్ర‌లు పోషిస్తున్నాడు. క్యారెక్ట‌ర్ రోల్స్‌లో కూడా సెల‌క్టివ్‌గా ఉంటున్నాడు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఇలా చేస్తున్న‌ట్లుగా ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు సేతుప‌తి. తాను అతిథి పాత్ర‌లు, క్యామియో రోల్స్ చేసిన‌పుడు.. ఆ చిత్రాల మేక‌ర్స్ వాటిని దుర్వినియోగం చేస్తున్నార‌ని అత‌న‌న్నాడు.

త‌న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవ‌డం కోసం పోస్ట‌ర్ల మీద త‌న ఫొటోనే పెద్ద‌గా వేస్తున్నార‌ని.. దీని వ‌ల్ల ప్రేక్ష‌కులు ఏదో ఊహించుకుంటున్నార‌ని, అలాగే తాను హీరోగా చేస్తున్న సినిమాల‌కు ఇది చేటు చేస్తోంద‌ని సేతుప‌తి అన్నాడు. అందుకే గెస్ట్, క్యామియో రోల్స్ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యిం తీసుకున్నాన‌ని చెప్పాడు. కానీ త‌న‌కు తాను పెట్టుకున్న ఈ ష‌ర‌తును జైల‌ర్-2 సినిమా కోసం ప‌క్క‌న పెట్టిన‌ట్లు సేతుప‌తి చెప్పాడు. అది సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సినిమా కాబ‌ట్టే ఈ మిన‌హాయింపు అన్నాడు.

ఆ సినిమా పోస్ట‌ర్లో త‌న ఫొటో వేసినా.. ప‌క్క‌న సూప‌ర్ స్టార్ ఉంటాడు కాబ‌ట్టి త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని, అందుకే అందులో క్యామియో చేశాన‌ని సేతుప‌తి అన్నాడు. అక్టోబ‌రు 15న రిలీజ్ కానున్న జైల‌ర్‌-2లో సేతుప‌తితో పాటు మ‌రిన్ని క్యామియోలు చూడ‌బోతున్నాం. జైల‌ర్‌లో అతిథి పాత్ర‌లు చేసిన శివ‌రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ ఇందులో కూడా క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. వీరికి తోడు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ రోష‌న్ కూడా ఇందులో క్యామియో రోల్ చేశాడు.

This post was last modified on August 2, 2026 9:41 pm

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

2 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

3 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

4 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

6 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

6 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

7 hours ago