మరికొద్దిరోజుల్లో టోక్యో ఒలంపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా ఒలంపిక్ విలేజ్ ని చేరుకుంటున్నారు. అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయగా.. అందులోని బెడ్స్ అట్టముక్కలతో తయారు చేశారని.. క్రీడాకారులు శృంగారం పై దృష్టిపెడితే.. ఆట సరిగా ఆడలేరి అందుకోసం యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ క్రీడాకారుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారడంతో.. అక్కడి అధికారులు సైతం స్పందించాల్సి వచ్చింది. అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన కార్డ్‌బోర్డ్ మంచాలు బలంగా ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు తెలిపారు. తమ ట్విట్టర్ అకౌంట్‌లో వాళ్లు ఈ విషయాన్ని చెప్పారు. శృంగారానికి సరిపడే రీతిలో మంచాలు దృఢంగా లేవని, ఆ మంచాలు యాంటీ-సెక్స్ అనే విమర్శలు వచ్చాయి.
అయితే ఐర్లాండ్‌కు చెందిన జిమ్నాస్ట్ రైస్ మెక్‌క్లినాగన్.. తన రూమ్‌లో ఉన్న కార్డ్‌బోర్డ్ మంచంపై ఎగిరి గంతులేశాడు. సామాజిక దూరాన్ని ప్రోత్సహించే రీతిలో మంచాలను తయారు చేసినట్లు వస్తున్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. జిమ్నాస్ట్ మెక్‌క్లినాగన్ ఆ వార్తలను తప్పుపట్టే రీతిలో మంచంపై ఎగిరెగిరి గంతులేశాడు. ఆ వీడియోను తమ ట్విట్టర్‌లో పోస్టు చేసిన నిర్వాహకులు .. కార్డ్‌బోర్డ్ మంచాలు బలంగా ఉన్నట్లు చెప్పారు.
ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఒలింపిక్ విలేజ్‌లో వేలాది మంది అథ్లెట్లు బస చేయనున్నారు. దాదాపు లక్షా 60 వేల కండోమ్‌లను అథ్లెట్లకు పంపిణీ చేయనున్నారు. నిజానికి క్రీడల సమయంలో ఆ కండోమ్‌లు వాడుకోవడానికి ఇవ్వడంలేదు. కానీ స్వదేశానికి వెళ్లిన తర్వాత ఎయిడ్స్ లాంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వాటిని ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
This post was last modified on July 19, 2021 5:55 pm
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన బాలయ్య.. ‘నరసింహనాయుడు’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాక చాలా ఏళ్ల…
'కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలతో కన్నడ నటుడు యశ్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడో తెలిసిందే. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో రాజమౌళి తర్వాత వినిపిస్తున్న పేరు అనిల్ రావిపూడినే. జక్కన్న ప్యాన్ ఇండియా…
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునే స్వేచ్ఛ లభించింది నిర్మాతలకు. పెద్ద సినిమాలకు…
సినిమా కోసం ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా పైసా ఖర్చు లేకుండా మార్కెటింగ్ చేసుకోవడంలో రాజమౌళిని మించిన వారు…
వచ్చే నెల ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న చావా మీదున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక రెట్టింపయ్యాయి. విక్కీ కౌశల్ టైటిల్…